బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Jan 20, 2020 , 02:11:46

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించండి

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించండి


కలెక్టరేట్‌/పెద్దపల్లి జంక్షన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్య ర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కోరారు. పెద్దపల్లి మున్సిపల్‌ పరిధిలోని 6, 7, 10, 11, 30, 31వ వార్డుల్లో ఆదివారం ఆయా వార్డుల అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభు త్వాల హయాంలో పట్టణాలాభివృద్ధి అధ్వా న్నం గా ఉండేదని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆరు నెలల కాలంలోనే పట్టణాల్లోని రోడ్లన్నీ అద్దంగా మెరిసిపోయేలా తయారు అయ్యాయని వివరించారు. పట్టణా లాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే పురపాలక ఐటీ శాఖ మంత్రి 50 కోట్లను విడు దల చేశారని వెల్లడించారు. ఆ నిధులతో ఏ వాడ రోడ్డు చూసినా సువిశాలంగా మారుతూ రాకపో కలకు అవాంతరాలు లేకుండా నిర్మిస్తున్నా మని వివరించారు. పెద్దపల్లిని జిల్లాగా ఏర్పాటు చేయ డమే ఈ ప్రాంత అభివృద్ధికి మొదటి మెట్టుగా తీసుకున్నారని చెప్పారు. అందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మున్సిపల్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిపించి చైర్మన్‌ స్థానాలను బహుమానంగా అప్పగించాల్సిన అవసరం ఉం దన్నారు. అందుకోసం కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. అలాగే ఎమ్మెల్యే దాసరి తనయుడు ప్రశాంత్‌రెడ్డి 30వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సంద ర్భంగా ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్ర మం లో  జడ్పీ సభ్యుడు బండారి రామ్మూర్తి, నాయ కులు బండారి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీపీ నూనేటి సంపత్‌ యాదవ్‌ పలువురు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భారీ మెజార్టీతో..

కలెక్టరేట్‌: పట్టణంలోని 6వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి పెద్ది గీతాంజలి-వెంకటేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆ వార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి పెద్ది గీతాంజలి-వెంకటేశ్‌ తరఫున ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి కాలినడకన వెళ్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న పెద్ది గీతాంజలిని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ఈ వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ఇందుకోసం వార్డు పరిధిలోని ప్రతి ఒక్క ఓటరు కూడా అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు వస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గీతాంజలికి ఓటు వేసి తమ సంపూర్ణ మద్దతు తెలియజేయాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే సాయంత్రం 6వ వార్డు అభ్యర్థి గీతాంజలి-వెంకటేశ్‌ తరఫున ఎమ్మెల్యే దాసరి సతీమణి పుష్పలతారెడ్డి ఇంటింటికీ తిరుగుతూ మహిళలకు బొట్టుపెట్టి ఓట్లు అభ్యర్థించా రు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అందుబాటులో ఉంటా

మున్సిపల్‌ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటా. నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు ప్రజలందరి సంక్షేమం కోసం పని చేస్తూనే వార్డును అన్ని విధా లా అభివృద్ధి చేస్తా. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సహకారంతో వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా పని చేస్తా. 
-టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పెద్ది గీతాంజలి-వెంకటేశ్‌