గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 19, 2020 , 01:02:08

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే పట్టంగట్టండి

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే పట్టంగట్టండిమున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలంతా నిండుమనసుతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు పట్టంగట్టి, ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు. శనివారం రామగుండం నగరంతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీల పరిధిలో నిర్వహించిన రోడ్‌షోలు, బహిరంగ సభలో ప్రసంగించారు. దశాబ్దాలుగా రాష్ర్టాన్ని పాలించిన సమైక్య పార్టీలు ఇక్కడ చేసింది శూన్యమనీ, రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు     ఒక్క టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఇవ్వాళ సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదనీ, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని చెప్పారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే రామగుండంలో మెడికల్‌ కాలేజీ ప్రారంభిస్తామనీ, పెద్దపల్లిలోనూ 250 పడకల దవాఖాన ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ఆయన, గులాబీ అభ్యర్థులను గెలిపించి విజయాన్ని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు కానుకగా ఇవ్వాలని కోరారు.
                                            - పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ
పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: దేశంలోనే రాష్ర్టానికి ప్రత్యేక స్థానం ఉందనీ, మన పథకాలు దేశానికే ఆదర్శమని మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. పురపాలక ఎన్నికల్లో అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాల ని కోరారు. శనివారం రామగుండం నగరంతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీల పరిధిలో నిర్వహించిన రోడ్‌షోలు, బహిరంగ సభలో ప్రసంగించారు.

పెద్దపల్లిలో 250 పడకల దవాఖాన

జిల్లా కేంద్రంగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి పుంతలు తొక్కుతున్న పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 250పడకల దవాఖానతోపాటు కిడ్నీడయాలసిస్‌, ట్రామాకేర్‌ సెంటర్లను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు  మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని జెండాచౌరస్తా వద్ద శనివారం ఏర్పా టు చేసిన బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లా అనేక సామాజిక కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుందని ప్రశంసించారు. పెద్దపల్లిలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేశామని, విద్యుత్‌ లైన్లను సైతం సరిచేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇంకా నిర్మించాల్సి ఉన్న రోడ్లను సైతం త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎల్లమ్మగుండమ్మ చెరువును పునరుద్ధరించి పట్టణంలో భూగర్భ జలాల పెంపునకు, తాగు, ఇతరఅవసరాలను సైతం శాశ్వతంగా పరిష్కరించారమని స్పష్టం చేశారు. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుంతుందని అన్నారు. గోదావరి నుంచి హైదరాబాద్‌కు తరళివెళ్తున్న తాగునీటి పైపులైన్‌ నుంచి పెద్దపల్లికి కనెక్షన్‌ ఇప్పించి, ఇక్కడి ప్రజల దాహార్తిని తీర్చడంలో ఎమ్మెల్యే దాసరి చొరవను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల సమగ్రాభివృద్ధికి  సీఎం కేసీఆర్‌ నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని, పురపాలక చట్టాలను తీసుకువచ్చారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ఓట్లు అడిగేందుకు వస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ నాయకులను తెలంగాణలో అమలు చేస్తున్న కార్యక్రమాలను ఆయా పార్టీల పాలిత రాష్ర్టాల్లో ఎందుకు చేపట్టడం లేదో నిలదీయాలని అన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, జిల్లాల అభివృద్ధికి తెలంగాణ ప్రభు త్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రజలు సహరించాలని కోరారు.

కులమతాలకతీతంగా అభివృద్ధి: ఎంపీ వెంకటేశ్‌

సీఎం కేసీఆర్‌ కులమతాలకతీతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎంపీ వెంకటేశ్‌ నేతకాని అన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.  టీఆర్‌ఎస్‌ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమం అనేది సాధ్యమని పెద్దపల్లి మున్సిపల్‌ పరిధిలోని  ప్రజలు టీఆర్‌ఎస్‌కే ఓటు వేసి గెలిపించాలని కోరారు. దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలు  ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. కాంగ్రెస్‌, బీజేపీలు గెలిచినా, ఓడినా ఇక్కడ  ప్ర యోజనం ఉండదని, కానీ టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుదనే విషయాన్ని ప్రతీఒక్కరూ గుర్తించాలన్నారు. కార్యక్రమంలో  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్‌, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, పెద్దపల్లి మున్సిపల్‌ కౌన్సిలర్లు మమతారెడ్డి, కొలిపాక శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అభ్యర్థులు జడల సురేందర్‌, ఇల్లెందుల కృష్ణమూర్తి, నజ్మీన్‌ సుల్తానా, కొలిపాక సంధ్య చిరంజీవి, కొలిపాక శ్రీనివాస్‌, సుద్దమల్ల అమ్రేష్‌, ఉనుకొండ సుజాత సునీల్‌, ఎరుకల కల్పన రమేశ్‌, ఊదరి మహేందర్‌, పెద్ది గీతాంజలి వెంకటేష్‌, అడవెళ్లి చంద్రారెడ్డిలు పాల్గొన్నారు.

మెడికల్‌ కళాశాల ప్రారంభిస్తాం

గోదావరిఖని టౌన్‌: తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన, ఉత్తర తెలంగాణలో గుండె కాయ అయిన గోదావరిఖని సింగరేణి గని కార్మికులు టీఆర్‌ఎస్‌ పార్టీని గుండెలకు హత్తుకుంటారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.  రాష్ట్రంలో ఏడు మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలని కేంద్రానికి విన్నవించామనీ, అందులో రామగుండం ఒకటనీ, అనుమతులు రాగానే మెడికల్‌ కశాశాలను ప్రారంభిస్తామని మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.   అలాగే ఖని దవాఖానలో ట్రామాకేర్‌ సెంటర్‌, ఎమర్జెన్సీ  కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి శనివారం సాయంత్రం పరశురాంనగర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఉద్యమ సమయం నుంచి సింగరేణి కార్మికులు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌  నాయకత్వాన్ని బలపరిచారన్నారు. సీఎం కేసీఆర్‌ కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుపర్చటంతో పాటు కార్మికులను పెద్దన్నగా నూతన హక్కులు అమలు పరుస్తున్నారని గుర్తుచేశారు. లక్షా 16వేల మంది ఉన్న కార్మికుల సంఖ్యను సీమాంధ్ర పాలకులు సగానికి తీసుకరాగా, సీఎం కారుణ్య నియ మాకాల పేరుతో కార్మికుల కుటుంబానికి మరో ఉద్యోగం కల్పిస్తున్నారని గుర్తుచేశారు. ఈ ప్రాం తంలో మూతపడిన పరిశ్రమలను పునఃప్రారంభించి తిరిగి పారిశ్రామిక ప్రాంతంగా రూపుదిద్దుతున్నట్లు తెలిపారు. ఏటా రూ.100 కోట్లు కేటాయించి అభివృద్ధికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. గత పాలకుల హయాంలో ఈ ప్రాంతానికి కనీస సౌకర్యాలు అందలేదన్నారు. 

సీఎంకు కానుకగా ఇద్దాం: కోరుకంటి ఎమ్మెల్యే చందర్‌

రామగుండాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు నగర మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకొని కానుకగా ఇద్దామని ప్రజలతో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ప్రతిజ్ఞ చేయించారు. బహిరంగ సభలో ఆయన ప్రసింగించారు. ఇందులో  పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌ సింగ్‌తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సభలో 4 డివిజన్లలో పోటీ చేస్తున్న పాతపెల్లి కావ్య-రవికుమార్‌, వడ్డెపల్లి రాజేశ్వరి-శంకర్‌, శ్రీదేవి, దొంత శ్రీనివాస్‌లను ఎమ్మెల్యే ప్రజలకు పరిచయం చేయించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

మంథని బాధ్యత మాదే: ఈటల

మంథనిటౌన్‌: మంథని మున్సిపాల్టీ అభివృద్ధి బాధ్యత టీఆర్‌ఎస్‌ పార్టీదేనని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మంథనిలోని స్థానిక గాంధీచౌక్‌లో శనివారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్‌, టీడీపీ పాలకులు హయాంలో రాష్ట్ర అభివృద్ధికి నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. కరెంట్‌, సాగునీళ్లతోపాటు ఇతర ప్రజా సమస్యలపై తాము గతంలో అసెంబ్లీలో స్పందిస్తే నిధులు లేవనీ, సమస్యలు పరిష్కారం చేయలేమని చేతులెత్తేశారనీ గుర్తుచేశారు. కానీ టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలోపే రైతుల కరెంట్‌ కష్టాలు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి పూర్తి చేశారని అన్నారు. 24 గంటల ఉచిత కరెంట్‌కు నిధులు ఎలా వస్తాయని ప్రతిపక్షాలు ప్రశ్నించాయనీ, మంచిమనసుతో ఆలోచించే సీఎం కేసీఆర్‌ ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో ఖర్చుకు వెనుకాడకుండా ఉచిత కరెంట్‌ను అందిస్తున్నార ని అన్నారు. మంథని ప్రాంతంలో ప్రతీ ఎకరాకు కాళేశ్వరం నీటిని అందించి సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీతోనే మంథని మున్సిపాల్టీ సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. సీఎం కేసీఆర్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ల ద్వారా పెద్ద మొత్తంలో నిధులు విడుదలవుతాయన్నారు. ఇప్పటికే మంథని మున్సిపాల్టీకి రూ.15కోట్లు మంజూరయ్యాయని గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా పుట్ట మధు, సర్పంచ్‌గా పుట్ట శైలజ మురికిగా ఉన్న మంథని పట్టణాన్ని సుందరగా తీర్చిదిద్దడం లో కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు.   మున్సిపల్‌ పరిధిలోని 13 కౌన్సిలర్లకు 13 మంది టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఎంపీ బొర్లకుంట వెంకటేశ్‌ నేతకాని మాట్లాడుతూ,  మంథని అభివృద్ధికి  పుట్ట శైలజ-మధు దంపతులు తమ జీవితాన్ని అంకితం చేయడం అభినందనీయమన్నారు. 

మోసపూరిత మాటలు నమ్మవద్దు : జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు

రోడ్‌షోకు అధ్యక్షత వహించిన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు మాట్లాడుతూ, ఎన్నికలు వచ్చిప్పుడుల్లా కాంగ్రెస్‌ పార్టీవారు మోసపూరిత ప్రచారంతో ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారనీ, అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని విమర్శించారు. మంథనిలో రూ. 5లకే భోజనం పెడుతామని మ్యానిఫెస్టోలో పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. నెలకు రూ.4లక్షల ఖర్చును మున్సిపాల్టీ భరించే పరిస్థితి ఉందా..? అనే విషయాన్ని ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. ఈజీఎస్‌ పని పో యిందని ప్రచారం చేస్తున్నారని, ఈజీఎస్‌ లాంటి వంద పనులను ప్రజల కోసం అమలు చేసే దమ్ముధైర్యం టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉందన్నారు. రైతులు నీళ్ల కోసం ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు దగ్గరికి వెళ్తే తాము అధికారంలో లేమని, నీళ్లు తీసుకురాలేమని చెప్పారన్నారు. ఇలాంటి పార్టీ వారు కౌన్సిలర్లుగా గెలిచి సాధించేది ఏమిటని ప్రశ్నించారు. మంథని పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత టీఆర్‌ఎస్‌ పార్టీ పరంగా తామే తీసుకుంటామని హామీ ఇచ్చారు.  13 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి మున్సిపాల్టీపై గులాబీ జెండా ఎగిరేలా చూడాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, ఎంపీపీ కొండ శంకర్‌, జడ్పీటీసీ తగరం సుమలత, టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి పుట్ట శైలజ, కౌన్సిలర్‌ అభ్యర్థులు గుండా విజయలక్ష్మి, ఆరెపల్లి కుమార్‌, కుర్ర లింగయ్య, నక్క నాగేంద్ర, కాయితీ సమ్మయ్య, గర్రెపల్లి సత్యనారాయణ, కొట్టే పద్మ, ఇల్లందుల శ్రీరామ్‌, శ్రీపతి బానయ్య, వీకే రవి, వేముల లక్ష్మి, దహగం జ్యోతికళ, నాయకులు ఏగోలపు శంకర్‌గౌడ్‌, తగరం శంకర్‌లాల్‌, ఎక్కటి అనంతరెడ్డి  

కాంగ్రెస్‌ నాయకులు చరిత్రహీనులు: మంత్రి ఈటల రాజేందర్‌

సుల్తానాబాద్‌: కాంగ్రెస్‌ నాయకులు అభివృద్ధి పనులను ఆటంకం సృష్టించి చరిత్ర హీనులుగా మిగిలిపోతున్నారనీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సుల్తానాబాద్‌తో పాటు పూసాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొ ని ప్రసంగించారు.  రాష్ట్రంలోని ప్రతి మున్సిపాల్టీకి ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించిందని తెలిపారు. సుల్తానాబాద్‌ మున్సిపాల్టీకి కేటాయించిన రూ.5 కోట్ల పనులను కాంట్రాక్టర్లు పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఈ పనులు జరిగితే టీఆర్‌ఎస్‌కు ఆదరణ దక్కుతుందని, ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వైపు మళ్లుతారనే అక్కసుతో పనులకు కాంగ్రె స్‌ నాయకులు అడ్డుపడుతున్నారని విమర్శించారు. అభివృద్ధి నిరోధకులకు ఓటేస్తే అభివృద్ధి సా ధ్యమేనా అని ప్రశ్నించారు. మున్సిపాల్టీ అభివృద్ధి కావాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌ మండ ల ప్రజలకు కాల్వల ద్వారా నీటిని అందించేందుకు ఢోకా లేదన్నారు. ఎంపీ వెంకటేశ్‌ మాట్లాడు తూ, రాష్ట్రాన్ని పాలించే వారికి అవకాశం ఇస్తే మున్సిపాల్టీ అభివృద్ధి చెందుతుందన్నారు.

కళ్లముందే అభివృద్ధి :ఎమ్మెల్యే  దాసరి,  ఎమ్మెల్సీ నారదాసు

తాము చేసిన అభివృద్ధి కళ్లముందే కనబడుతుందని,  పనిచేసే అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కోరారు. స్టేడియం, ట్యాంక్‌బండ్‌,  పార్క్‌, సీసీ రోడ్లు, మురుగు కాల్వలకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రాజీవ్‌ రహదారి నుంచి పూసాల గ్రామం వరకు రూ.కోటితో తారురోడ్డు వేసేందుకు నిధులు వచ్చాయని, వెంటనే పనులు చేపడుతామని తెలిపారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే ఉత్సవ విగ్రహాలుగా మిగులుతారనీ, అభివృద్ధి నిరోధకులు మిగలడమే తప్పా ఓరిగేదేమి లేదనీ స్పష్టం చేశారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, జూలపల్లి జడ్పీటీసీ బోద్దుల లక్ష్మన్‌, సుల్తానాబాద్‌ ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, టీఆర్‌ఎస్‌ నాయకులు అయిల రమేశ్‌, బుర్ర శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీగిరి శ్రీనివాస్‌, గాజుల రాజమల్లు, గుర్రాల మల్లేశం, పురం ప్రేమ్‌చందర్‌రావు, ముత్యం రమేశ్‌, కోట రంగారెడ్డి, గుర్రాల శ్రీనివాస్‌, సూరశ్యాం, కూకట్ల గోపి, పురం వెంకటరమణ, కోట చిన్న రాంరెడ్డి, బండ అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమ బ్రాండ్‌ చందర్‌: మంత్రి ఈటల కితాబు

గోదావరిఖని టౌన్‌: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ బ్రాండ్‌ కోరుకంటి చందర్‌ అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కితాబిచ్చారు. శనివారం పరశురాంనగర్‌లో జరిగిన ప్రగతి సంక్షేమ సభలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చందర్‌ను గోదావరిఖని ప్రజలు ఉద్యమనేతగా గుర్తించారన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కోరుకంటి చందర్‌లాంటి అనేక మంది ఉద్యమకారులు ఫలితంగానే తెలంగాణ సాధించుకోగలిగామని మంత్రి గుర్తుచేశారు. చందర్‌ ఉద్యమ బ్రాండ్‌, తెలంగాణ పోరాట యోధుడన్న మంత్రి మాటలకు ప్రజలు జై తెలంగాణ అంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.


logo