మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Jan 19, 2020 , 01:01:03

ఇంటింటికీ గులాబీ సేన

ఇంటింటికీ గులాబీ సేన
  • -దూసుకెళ్తున్న టీఆర్‌ఎస్‌
  • - బల్దియాల్లో ప్రచార హోరు n గడపగడపకూ అభ్యర్థులు
  • - మద్దతుగా జిల్లా వ్యాప్తంగా మంత్రి ఈటల విస్తృత పర్యటన
  • - మంథనిలో ఇంటింటికీ జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
  • - కోరుకంటి దూకుడు.. రామగుండంలో రోడ్‌షోలు
  • - అలుపెరుగని దాసరి.. జిల్లా కేంద్రంలో ఓట్ల అభ్యర్థన

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. జిల్లాలోని పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపాల్టీల్లోని 62వార్డులతో పా టుగా రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 50డివిజన్‌లలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ప్రచారాలు వేగం పుంజుకున్నది. శనివారం టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శా ఖ మంత్రి ఈటల రాజేందర్‌, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేతకాని, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, దాసరి మనోహర్‌రెడ్డి సభలు, సమావేశాలు, రోడ్‌షోల కోరడంతో పాటుగా నేరుగా ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. సుల్తానాబాద్‌ మున్సిపాల్టీ పరిధిలోని పూసాల వద్ద రోడ్‌షో, పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని జెండా చౌరస్తాలో సభ, రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని పరశురాంనగర్‌లో సభ, మంథని అంబేద్కర్‌ చౌక్‌ వద్ద రోడ్‌ షోలను నిర్వహించగా, మంత్రి ఈటల రాజేందర్‌ పాల్గొని ప్రసంగించారు.

మంత్రి ప్రసంగం టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపగా ఓటర్లను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమాల్లో మంత్రి వెంట ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేతకాని, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌ సింగ్‌ పాల్గొని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వారు ప్రజలకు వివరించారు. అంతకుముందు ఉదయం మంథనిలోని 1, 4, 11, 13వార్డుల్లో జడ్పీ చైర్మన్‌ మధూకర్‌ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అ భ్యర్థించారు. అలాగే రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని పలు డివిజన్లలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ప్రచారం చేశారు. కారు గుర్తుకే ఓ టు వేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అటు సాయంత్రం పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాల్టీల  పరిధిలోని  పలు వార్డుల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొని, ఇంటింటికీ వెళ్లి టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి అనీ, అభ్యర్థులను గెలిపించాలని విన్నవించారు. ఇక రామగుండం కార్పొరేషన్‌ పరిధిలో రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ బోర్డు కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ సైతం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీఆర్‌ఎస్‌కు అధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు.