బుధవారం 01 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 19, 2020 , 00:57:17

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించండి

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించండి
  • - ఆ పార్టీ నేత దాసరి ప్రశాంత్‌రెడ్డి
  • - మ్యానిఫేస్టో కరపత్రాలు పంచుతూ ఇంటింటా ప్రచారం

కలెక్టరేట్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని ఆ పార్టీ నేత, ట్రినిటీ విద్యాసంస్థల కరస్పాండెంట్‌ దాసరి ప్రశాంత్‌రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పెద్దపల్లి మున్సిపల్‌ పరిధిలోని 6వ వార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి పెద్ది గీతాంజలి-వెంకటేశ్‌ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ మ్యానిఫేస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ, కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో కాల్వశ్రీరాంపూర్‌ ఎంపీపీ నూనేటి సంపత్‌ యాదవ్‌, నాయకులు నూనేటి కుమార్‌ యాదవ్‌, వెన్నం రవీందర్‌, జిన్నా రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా..

ఓటర్లంతా ఆశీర్వదించి గెలిపిస్తే వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. వార్డు పరిధిలోని మట్టి రోడ్లను సీసీగా మార్చడంతోపాటు అంతర్గత మా ర్గాలను అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతా.
- 6వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి

పెద్ది గీతాంజలి-వెంకటేశ్‌ మైనార్టీలు, దళితుల అభ్యున్నతికి కృషి..

పెద్దపల్లి టౌన్‌: తెలంగాణ ప్రభుత్వం మైనార్టీలు, దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని 24వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జడల సురేందర్‌ తెలిపారు. పట్టణంలోని 24వ వార్డులో ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్‌ దాసరి ప్రశాంత్‌రెడ్డితో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి ప్రశాంత్‌ రెడ్డి, జడల సురేందర్‌ ఇంటింటికీ, వ్యాపార సముదాయాల్లోకి వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఇందిరానగర్‌, చిన్నమసీదు, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, అమర్‌ నగర్‌, సురభికాలనీ, సంతోషిమాత ఆలయం ప్రాంతాల్లో తిరుగుతూ టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా సురేందర్‌ మాట్లాడుతూ..  పట్టణంలో దారిద్యరేఖకు దిగువనున్న పేద వారికి 70 గజాల ఇంటి స్థలంతో పాటు డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  ప్రచారంలో టీఆర్‌ఎస్‌ నాయకులు తబ్రేజ్‌, బొడ్డుపల్లి రమేశ్‌, బొంకూరి కైలా సం, కుంభం సంతోష్‌, నరేందర్‌, పున్నం స్వామి, ఆనంద్‌, సంపత్‌రావు, శ్యామ్‌, మధు, హబీబ్‌, సంతోష్‌ పాల్గొన్నారు. 

ఎమ్మెల్యే విస్తృత ప్రచారం

పెద్దపల్లి జంక్షన్‌:  బల్దియా ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. పట్టణంలోని 25, 30వ వార్డుల్లో రాష్ట్ర మైనార్టీ చైర్మన్‌ అక్బర్‌ హుస్సేన్‌తో కలిసి ఎమ్మెల్యే దాసరి ఇంటింటా తిరుగుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. అదే విధంగా ఎమ్మెల్యే సతీమణి దాసరి పుష్పలత 30వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి హబీబా బేగం ఖదీర్‌ఖాన్‌ తరుపున ఎన్నికల ప్రచారం చేసి చేశారు. logo
>>>>>>