గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 18, 2020 , 04:53:03

ప్రచారణం!

 ప్రచారణం!


పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలోని రామగుండం నగరపాలక సంస్థతో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ ప్రచారం జోరుగా సాగుతున్నది. ఆయా డివిజన్లు, వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇంటింటికీ వెళ్తూ ఓటు అభ్యర్థిస్తుండగా, అంతటా ఎన్నికల సందడి కనిపిస్తున్నది. రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 50 డివిజన్లు, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపాల్టీల్లోని 62 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. గోదావరిఖనిలో కార్పొరేషన్‌ క్రిస్టియన్‌ పాస్టర్ల సంఘం నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని క్రైస్తవ సమాజానికి తగిన గౌరవాన్ని అందిస్తూ, క్రిస్మస్‌ పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. క్రైస్తవుల అభివృద్ధి సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాటుపడుతున్నదనీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి క్రైస్తవులు మద్దతు తెలుపాలని కోరారు. మంథని మున్సిపాల్టీ పరిధిలోని 1, 2, 3, 6, 11వ వార్డుల్లో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జడ్పీ అధ్యక్షులు పుట్ట మధుకర్‌, జక్కు వర్షిణి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గుండా విజయలక్ష్మి, పుట్ట శైలజ, ఆరెపల్లి కుమార్‌, కాయితి సమ్మయ్య, వీకే రవిని గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 3, 8, 9, 13, 29వ వార్డుల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు.

కారు గుర్తుకే ఓటేసి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు లైశెట్టి భిక్షపతి, వడ్డేపల్లి లక్ష్మి, ఎరుకల కల్పన, సాదుల సోని, ఉప్పు కృష్ణమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 36 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి గడప గడపకూ వివరించారు. రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 14, 15, 16, 17, 18, 19, 25, 26, 27, 28, 29వ డివిజన్లలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ విస్తృతంగా తిరిగారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నీల పద్మ, బీ శంకర్‌నాయక్‌, ఎండీ గౌస్‌ పాషా, శాగంటి శంకర్‌, కోండ్ర మాధవి, కలకుంట్ల రజిత, సాగె సౌమ్య, అడప శ్రీనివాస్‌, బీమారపు మనమ్మ, ఇంజపురి పులేందర్‌, జాలి రాజమణిని గెలిపించాలని ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో రామగుండం కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, ముందుకు సాగారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయంతోనే రామగుండం కార్పొరేషన్‌లో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

50 డివిజన్లలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలని ఆయన ఓటర్లకు విన్నవించారు. 48వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముడుతనపల్ల స్వరూపకు మద్దతుగా రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ బోర్డ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ ప్రచారం చేపట్టారు. స్వరూపను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మంథని మున్సిపాల్టీ పరిధిలోని 5వ వార్డులో జడ్పీటీసీ తగరం సుమలత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నక్క నాగేంద్రను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంథని 7వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గర్రెపల్లి సత్యనారాయణకు మద్దతుగా కమాన్‌పూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణగౌడ్‌ ఎన్నికల ప్రచారం చేపట్టారు. రామగుండం 26వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అడప శ్రీనివాస్‌, 27వ డివిజన్‌లో భీమారపు మణెమ్మకు మద్ధతుగా హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ రోడ్‌ షో నిర్వహించారు. ప్రధాన వీధులన్నీ కలియ తిరిగి, టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని 24వ డివిజన్‌లో మండలి విప్‌ భానుప్రసాద్‌రావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కలకుంట్ల రజిత శ్రీపతిరావును అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.


logo