గురువారం 09 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 18, 2020 , 04:52:18

రామగుండంలో కారు జోరు

రామగుండంలో కారు జోరు


యైటింక్లయిన్‌ కాలనీ / గోదావరిఖని టౌన్‌ : రామగుండం నగర పాలక సంస్థలో కారు ప్రచారం జోరందుకుంది. నగర పాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో గెలుపు మాదేనని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ దీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన పలు వార్డులలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్లలో ప్రజల ఆదరణ ఆప్యాయతను చూసి ఆయన 50 డివిజన్లలో గెలుపు తమదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. నగర పాలక సంస్థ పరిధిలోని 14, 15, 16, 17, 18, 19, 25, 26, 27, 28, 29 డివిజన్లలో పాల్గొన్నారు. అల్లూరులోని అంబేద్కర్‌ విగ్రహానికి, షిర్కే బస్టాండులోని తెలంగాణ తల్లికి పూలమాల వేశారు. అనంతరం డివిజన్లలో రోడ్‌షో నిర్వహిస్తూ, ప్రధాన కూడళ్లలో మాట్లాడారు. కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురుతేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.  ఏండ్లుగా సింగరేణి స్థలాల్లో ఇండ్లు కట్టుకుని నివాసముంటున్నవారికి త్వరలోనే ఇండ్ల పట్టాలను ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా 76 జీఓ విడుదల చేయించి ఇటివలే ఇండ్ల పట్టాల కోసం దరఖాస్తు స్వీకరించామని గుర్తు చేశారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే పట్టాల పంపిణీ కార్యచరణ కొనసాగుతుందని తెలిపారు. అర్హత గలిగిన ప్రతి ఒక్కరికీ ఈ ఏడాది చివరికి కల్లా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కట్టించేలా చర్యలు తీసుకుంటామనీ, దీనికి అనుగుణంగానే ఇటీవలే డబుల్‌ బెడ్‌ ఇండ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేసి పనులు వేగవంతం చేయిస్తున్నామని తెలిపారు. అనంతరం 15 డివిజన్‌లో బీజేపీ సీనియర్‌ నాయకుడు లింగంనాయక్‌ ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి సంఘీభావం తెలిపారు. 16వ డివిజన్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఉమా రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా, ఆయనకు కండువా కప్పి స్వాగతం పలికారు. 19వ డివిజన్‌లో సొంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ముద్దసాని సంధ్యారాణి, సిద్ద రజిత టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొమ్ము నాగమ్మకు సంఘీభావం తెలిపారు. వేర్వేరుగా జరిగిన రోడ్‌ షోలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బదావత్‌ శంకర్‌నాయక్‌, ఎండీ గౌస్‌పాషా, సాగంటి శంకర్‌, కొండ్ర మాధవి స్టాలిన్‌, కొమ్ము నాగమ్మ, నాయకులు అయిలి శ్రీనివాస్‌, దుర్గం రాజేశం, కొండ్ర స్టాలిన్‌గౌడ్‌, పోగుల వీరారెడ్డి, జక్కుల దామోదర్‌రావు, ఎరవెల్లి గోపాల్‌రావు, ముస్కె శ్రీనివాస్‌, మేడి సదానందం, మల్లికార్జున్‌, బేతి చంద్రయ్య, కుమార్‌ నాయక్‌, సారయ్యనాయక్‌, పులి రాకేశ్‌, ఎండీ రహీం, గూడెల్లి రాంచందర్‌, శ్రీనివాస్‌, సాగర్‌  పాల్గొన్నారు.

మసీదులలో ప్రచారం..

శుక్రవారం గులాబీ నేతలు ముస్లింలను ప్రత్యేకంగా కలిసి ప్రచారం నిర్వహించారు. ముస్లింలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో ఉద్యమ కాలం నుంచి నేటి వరకు ముస్లింల మైనార్టీలకు అండగా ఉంటూ ప్రతి గరీబు కూడా పండుగ రోజు ఆనందంగా నిర్వహించుకునేలా ప్రతి కుటుంబానికి కొత్త బట్టలు పంపిణీ చేయడం టీఆర్‌ఎస్‌ హయాంలోనే చూస్తున్నామన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో 48వ డివిజన్‌ అభ్యర్థి ముడతనపల్లి స్వరూప సారయ్య, 49వ డివిజన్‌ నూతి తిరుపతి, 50వ డివిజన్‌ బాలసాని పద్మ స్వామి గౌడ్‌ విజయం కోసం కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అలాగే, 14 డివిజన్‌లో నీలం పద్మ, 15వ డివిజన్‌లో ఆర్‌.శంకర్‌ నాయక్‌, 16వ డివిజన్‌లో ఎండీ గౌస్‌ పాషా, 19వ డివిజన్‌లో సాగంటి శంకర్‌, 18వ డివిజన్‌లో కోండ్ర మాధవి, 24వ డివిజన్‌లో కలకుంట్ల రజిత, 25వ డివిజన్‌లో సాగి సౌమ్య, 26వ డివిజన్‌లో అడప శ్రీనివాస్‌, 27వ డివిజన్‌లో బీమారపు మణెమ్మ, 28వ డివిజన్‌లో ఇంజపురి పులేందర్‌, 29వ డివిజన్‌లో జాలి రాజమణి, 30వ డివిజన్‌లో బంగి అనిల్‌కుమార్‌లను గెలిపించాలని కోరారు.



logo