బుధవారం 01 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 17, 2020 , 00:35:42

టీఆర్‌ఎస్‌ దూకుడు

టీఆర్‌ఎస్‌ దూకుడు
  • -ప్రచారాన్ని హోరెత్తిస్తున్న శ్రేణులు-వీధివీధినా ఓట్లు అడుగుతున్న అభ్యర్థులు
  • - ఇంటింటా పథకాల వివరణ.. ఓట్ల అభ్యర్థన..
  • -గోదావరిఖనిలో ఎమ్మెల్యే చందర్‌తో కలిసి ఎంపీ వెంకటేశ్‌ విస్తృత పర్యటన
  • -టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి అనీ, కారు గుర్తుకు ఓటేయాలని విన్నపం
  • -మంథనిలో చేరికలతో జడ్పీ చైర్మన్‌ మధు బిబీబిజీ.. పలు వార్డులో ప్రచారం
  • - పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో కలియదిరిగిన ఎమ్మెల్యే దాసరి.. ఓట్ల అభ్యర్థన
  • - 50వ డివిజన్‌లో ఇంటింటికీ పీహెచ్‌సీ చైర్మన్‌ కోలేటి దామోదర్‌
  • - గులాబీ అభ్యర్థులకే పట్టంగట్టాలని పిలుపు

(పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ): జిల్లాలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ జిల్లా అగ్రనేతలు విస్తృతంగా పర్యటిస్తూ, ఓట్లు అభ్యర్థిస్తున్నారు. రామగుండంలోని 11, 12వ డివిజన్‌లో ఎంపీ వెంకటేశ్‌నేతకాని, స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్‌ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తి ఎవరు లేరనీ, పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని వివరించారు. ఇటు జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ మంథని పట్టణంలోని 10వ వార్డు అభ్యర్థి శ్రీపతి బానయ్య, 12వ వార్డు అభ్యర్థి వేముల లక్ష్మిలకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రభు త్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే వివిధ పార్టీల నుంచి తరలివచ్చిన ముఖ్య నాయకులు, కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుల్తానాబాద్‌ మున్సిపాల్టీ పరిధిలోని 1, 2, 3,4, 5 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పసెడ్ల మమత, గాజుల లక్ష్మీ, ఐల రాధ, బిరుదు సుమలత, పారుపల్లి జ్ఞానేశ్వరి-గుణపతిలను గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేశారు.

అలాగే పెద్దపల్లి పట్టణంలో 1, 2, 3, 4, 5, 6, 9, 10, 11, 12తోపాటు 15, 16, 17, 19, 24 అలాగే 25నుంచి 36 వార్డుల్లో  ఎమ్మెల్యే దాసరి అలుపెరుగని ప్రచారం చేశారు. వార్డుల్లోని ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేయాలని కోరారు. ప్రధాన కూడళ్ల వద్ద రోడ్‌షోలను నిర్వహించి ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను, పట్టణాల అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా మున్సిపాల్టీ పరిధిలోని పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 24వ వార్డులో అభ్యర్థి జడల సురేందర్‌ను గెలిపించాలని ఓట్లు అభ్యర్థించగా, ఇక్కడ 50మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. రామగుండం మున్సిపాల్టీ పరిధిలోని 47, 48వ డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మేకల సమ్మయ్య, ముడుతనపల్లి స్వరూపను గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, 50వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాలసాని పద్మను గెలిపించాలని కోరుతూ రాష్ట్ర పోలీస్‌ హౌజింగ్‌ బోర్డు చైర్మన్‌ కోలేటి దామోదర్‌ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రామగుండంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతోపాటు రామగుండంలో మరోమారు తమకు పట్టంగట్టాలని కోరారు. పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 6, 8, 19వార్డుల్లో ఎమ్మెల్యే దాసరి తనయుడు ప్రశాంత్‌రెడ్డి ఇంటింటా తిరిగి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పెద్ది గీతాంజలి, వొడ్డెపల్లి లక్ష్మి, బెక్కం ప్రశాంత్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 3, 6, 8, 31, 36వార్డుల్లో ఎమ్మెల్యే సతీమణి దాసరి పుష్పలత, ఎమ్మెల్యే కోడలు, 21వ వార్డు కౌన్సిలర్‌ మమతారెడ్డి విస్తృత ప్రచారం చేశారు. లైశెట్టి బిక్షపతి, పెద్ది గీతాంజలి, వొడ్డెపల్లి లక్ష్మి, పైడ పద్మ, షేక్‌ నజీంసుల్తానాలను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మమతారెడ్డి హోటల్‌ వద్ద జిలేబీలు చేస్తూ ఆకట్టుకున్నారు. logo
>>>>>>