గురువారం 09 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 17, 2020 , 00:32:53

నియమావళి పాటించాల్సిందే

నియమావళి పాటించాల్సిందే
  • - నిబంధనలకు లోబడే ప్రచారం చేయాలి
  • - ఇంటి యజమానుల అనుమతి లేనిదే పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టద్దు
  • - పరిమితి మేరకు ఖర్చు చేయాలి
  • - నగర కమిషనర్‌, జిల్లా అదనపు ఎన్నికల అధికారి శ్రీనివాస్‌

గోదావరిఖని టౌన్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థులు తప్పనిసరిగా ప్రవర్తనా నియమావళి పాటించాలని రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్‌, జిల్లా అదనపు ఎన్నికల అధికారి బోనగిరి శ్రీనివాస్‌ కోరారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులతో రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో మినీ ఆడిటోరియంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవర్తన నియమావళి తదితర అంశాలపై ఆయన అభ్యర్థులను వివరించారు. నగర పాలక సంస్థ పరిధిలో పోటీ చేసే అభ్యర్థులకు కేవలం లక్షా 50వేల రూపాయలు మాత్రమే పరిమితిగా ఉంటుందని పేర్కొన్నారు. వ్యయ పరిమితికి లోబడి ఒకే బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారా ఖర్చు పెట్టాలని తెలిపారు. గత ఎన్నికల్లో వ్యయ వివరాలు సమర్పించని కారణంగా 363 మంది రామగుండం ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడిందని తెలిపారు. ఇంటి యజమాని నుంచి లిఖిత పూర్వక అనుమతి లేనిది వాల్‌ పోస్టర్లు, వాల్‌ రైటింగ్‌ చేయకూడదని సదరు వ్యక్తి ఫిర్యాదు చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలకు ఆరోపణలకు పాల్పడకూడదని అన్నారు.

కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం కార్పొరేటర్లు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై మన వ్యర్థపదార్థాల నిర్వహణ అనుమతులు తదితర అంశాలపై వారికి అవగాహన కల్పించారు. ఎలక్షన్లు, ఏజెంట్లు, పోలింగ్‌ ఏజెంట్లు, కౌటింగ్‌ ఏర్పాట్లు, ప్రచార సమయాలు, అనుమతులు పొందడంతదితర అంశాలపై కూడా డా.పీ.రవీందర్‌ రెడ్డి అవగాహన కల్పించారు. ఎన్నికల వ్యయ లెక్కింపు, అకౌంట్ల నిర్వహణ వ్యయ సమర్పణ తదితర వివరాలకు వ్యయ పరిశీలకులు, విక్టోరియారాణి, జయప్రకాశ్‌ రెడ్డి అవగాహన కల్పించారు. వన్‌ టౌన్‌ సీఐ పర్స రమేశ్‌ మాట్లాడుతూ శాంతియువత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని అభ్యర్థులను కోరారు. అన్ని ధ్రువీకరణ పత్రాలు, అనుమతుల వెంట ఉంచుకోవాలని కోరారు. అభ్యర్థుల సౌలభ్యం ఎన్నికల సంఘం ప్రచురించిన కరదీపికను పంపిణీ చేశారు. గురువారం ఉదయం 10 నుంచి, 1 నుంచి 25 వరకు, సాయంత్రం 4 గం.ల నుంచి 26 నుంచి 50 డివిజన్ల అభ్యర్థులకు ఈ శిక్షణ అవగాహన నిర్వహించారు.


logo