శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 15, 2020 , 03:31:24

సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించాలి

సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించాలి


ధర్మపురి, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ విస్త్రతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవా రం ధర్మపురిలో ధర్మపురి మండల కాంగ్రెస్‌ మహి ళ అధ్యక్షురాలు చీర్నేని ఉమాదేవితోపాటు కాంగ్రె స్‌, బీజేపీకి చెందిన దాదాపు 50 మంది యువకు లు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి సంక్షేమ పథకాలపై విస్త్రత ప్రచారం చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూనే, ఇవ్వని హామీలను కూడా అమలు చేశారన్నారు.. ఒక్క ధర్మపురి పట్టణానికే రూ.220 కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. మేజర్‌ పం చాయతీగా ఉన్న ధర్మపురిని మరింత అభివృద్ధి పరిచేందుకే మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేశారన్నారు. ధర్మపురి పట్టణ నడి బొడ్డున మురికి కూపంలా ఉన్న చింతామణి చెరువును ఇదివరకే రూ.1.30 కోట్లతో సుందరీకరించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో చెరువు మధ్యలో శ్వేతవరాహ నరసింహస్వామివారి విగ్రహం ఏర్పాటు చేయనున్నామన్నారు. రూ. 60లక్షలతో మరో మురికి కూపం తమ్మళ్లకుంటను సుందరీకరిస్తున్నట్లు తెలిపారు.  ధర్మపురి టెంపుల్‌ సిటీ అభివృద్ధికి రూ. 100కోట్లు, మున్సిపల్‌ అభివృద్ధికి రూ.35కోట్లు కేటాయించినట్లు తెలిపారు.  ధర్మపురి మున్సిపల్‌ ఎన్నికల్లో  బరిలో ఉన్న 15 మంది అభ్యర్థులు భారీ మెజారిటితో గెలిచేలా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ఈ సంధర్భంగా పిలుపునిచ్చారు. ఇక్కడ జడ్పీటీసీ బాదినేని రాజేందర్‌, ఎంపీపీ చిట్టిబాబు ఉన్నారు.logo