మంగళవారం 31 మార్చి 2020
Peddapalli - Jan 15, 2020 , 03:30:46

గులాబీ దండు గెలుపే లక్ష్యం

గులాబీ దండు గెలుపే లక్ష్యం


గోదావరిఖని టౌన్‌ : రామగుండం నగర పాలక సంస్థ ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్‌ బలపరుస్తున్న 50 మంది అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు ఏకపక్షంగా నిలిపి మేయర్‌ పీఠంను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ యువనేత కేటీఆర్‌కు కానుకగా అందజేయాలనీ, ఇందుకు అందరు అభ్యర్థులు, పార్టీ శ్రేణులంతా కలిసి నిరంతరం పని చేయాలని సూచించారు. సింగరేణి కార్మికులకు, వ్యాపారులకు, యువకులకు వృద్ధులకు, విద్యార్థులకు కేసీఆర్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం అందిస్తున్న ఘనత కేసీఆర్‌దే అనీ, ఎవరూ మరువకూడదని ఆయన ఉద్ఘాటించారు. మహిళలపై ప్రత్యేక శ్రద్ధతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రతి మహిళ సాధికారతతో ఆర్థికంగా అభివృద్ధి చెంది, అన్ని రంగాల్లో ముందడుగు వేసేలా ప్రోత్సహిస్తున్నది టీఆర్‌ఎస్‌ పార్టీనే అన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తూ కారు గుర్తుకు ఓటేసి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఆయన కోరారు.

టీఆర్‌కు పట్టం కాయం..

ఫెర్టిలైజర్‌సిటీ : రామగుండం కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారనీ, ఇక్కడ గులాబీ జెండా ఎగిరి క్లీన్‌ స్వీప్‌ ఖాయమని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు నగర పాలక సంస్థ పరిధిలోని 39వ డివిజన్‌లో ఆయన టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గోపగాని శ్యామల గౌడ్‌కు మద్దతు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీస వసతులకు నోచుకోని తెలంగాణ ప్రజలంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో హక్కులు సాధించుకోవడంతోపాటు విద్య, వైద్య, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ లాంటి పథకాలతో ఇంటింటికీ తాగు, సాగునీటితోపాటు ప్రజల ముందుకే ఎన్నో వసతులు చేకూరాయనీ, దీనికి తోడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏటా వంద కోట్లు రామగుండం కార్పొరేషన్‌కు కేటాయిస్తున్నారనీ, అందుకు కృతజ్ఞతగా రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు ఓటేసి, భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిస్తేనే రామగుండం అభివృద్ధి జరుగుతుందని గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు గోపగాని సతీశ్‌ గౌడ్‌తోపాటు మరో 20 మంది టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా, వారికి కండువా కప్పి ఆహ్వానించారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు మోహన్‌ గౌడ్‌, మర్రి మల్లయ్య, బొర్ర సత్యనారాయణ, ఆముల భద్రయ్య, పొగాకుల కొంరయ్య, వెంకట్రావు, శ్రీకాంత్‌, జిమ్మిడి మల్లేశ్‌, కల్వల సంతోష్‌, నరేశ్‌, ప్రభంజన్‌ రెడ్డి తదితరులున్నారు.
logo
>>>>>>