గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 15, 2020 , 03:28:55

గోదారంగనాథస్వామి కల్యాణం

గోదారంగనాథస్వామి కల్యాణం


ధర్మారం: మండలం కేంద్రంలోని శ్రీరామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ముగిశాయి. ఆలయ ధర్మకర్తలు పూస్కూరు పద్మజ-జితేందర్‌రావు ఆధ్వర్యంలో గోదాదేవి శ్రీ రంగనాథుడి కల్యాణోత్సవం ఘనంగా చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం చేశారు. ఉత్సవంలో వైస్‌ ఎంపీపీ మేడవేని తిరుపతి, మండల కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ రఫి, టీఆర్‌ఎస్‌ నాయకుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వ్యాపారి జిడిగె కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్‌రూరల్‌: గర్రెపల్లిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో  గోదా రంగనాథుల కల్యాణాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా భక్తులకు మాదాసు రంగారావు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షురాలు, సర్పంచ్‌ వీరగోని సుజాత, ఎంపీటీసీ సభ్యురాలు పులి అనూష, ఎల్లారెడ్డిపేట తాసిల్దార్‌ శ్రీకాంత్‌, ఉప సర్పంచ్‌ మధుకర్‌, నాయకులు రమేశ్‌గౌడ్‌, సత్యనారాయణరావు,  లక్ష్మణ్‌, కన్న కిషన్‌, రామయ్య, జొన్నకోటి వెంకటేశం, శంకర్‌స్వామి, శ్రీనివాస్‌, కనుకయ్య పాల్గొన్నారు.

కాల్వశ్రీరాంపూర్‌ : మండలంలోని పెగడపల్లి వేణుగోపాలస్వామి ఆలయంలో గోదా రంగనాథుల కల్యాణాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవానికి గ్రామస్తులు తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్‌, జడ్పీ సభ్యుడు వంగళ తిరుపతిరెడ్డి, సర్పంచ్‌ అరెల్లి సుజాత, ఎంపీటీసీ సభ్యురాలు సుముఖం నిర్మల, మాజీ సర్పంచులు గొడుగు లక్ష్మి, కొమురయ్య, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, నూనేటి కుమార్‌, కూకట్ల నవీన్‌, వార్డు సభ్యులు, ఆలయ అర్చకులు రామాచార్యులు,  వల్లూరి మహేశ్‌శర్మ, వల్లూరి సతీశ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

జూలపల్లి : మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో మంగళవారం భక్తుల ఆనందోత్సాహాల మధ్య శ్రీ గోదా రంగనాథుల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా కొనసాగింది. పెద్దయెత్తున మహిళలు మంగళహారతులు, ఒడిబియ్యం పట్టుకొని ఆలయానికి తరలి వచ్చారు. వికాస తరంగిణి ఆధ్వర్యంలో దేవతామూర్తుల కల్యాణ తంతు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి దంపతులు కల్యాణం తిలకించి ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేపట్టారు.


logo