శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 14, 2020 , 02:40:48

టీఆర్‌ఎస్‌ దూకుడు

టీఆర్‌ఎస్‌ దూకుడు


పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: బల్దియా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దపల్లి మున్సిపాల్టీలో దూసుకుపోతున్నది. నామినేషన్ల ఉపసంహరణకు 12 గంటల సమయం ఉండగానే రెండు కౌన్సిలర్‌ స్థానాలను ఏకగ్రీవంగా సునాయసంగా దక్కించుకొంది. సోమవారం 18వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్‌ తన సమీప ప్రత్యర్థులు పోటీ నుంచి విరమించుకోవడంతో ఏకగ్రీవంగా ఎన్నిక కాగా తాజాగా మంగళవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కోడలు చిట్టిరెడ్డి మమతారెడ్డి 21వ వార్డులో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్‌ మహిళకు కేటాయించిన 21వ వార్డులో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దొంతిరెడ్డి మంగమ్మ, బీజేపీ అభ్యర్థి రేడపాక మల్లేశ్వరి, ముడుసు విజయలక్ష్మి, బండారి పుష్ప, తిరుమలరెడ్డి స్రవంతి తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఈ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన మమతారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. 18వ వార్డు బీసీ జనరల్‌కు రిజర్వు కాగా ఇక్కడ కొలిపాక శ్రీనివాస్‌, కొలిపాక సంధ్య, పుట్ట మొండయ్య నామినేషన్‌ దాఖలు చేశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పుట్ట మొండయ్య, కొలిపాక సంధ్య ఆదివారం తమ నామినేషన్లను ఉపసంహరించుకొని ఎన్నికల భరిలో నుంచి తప్పుకోవడం తో ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో పెద్దపల్లి మున్సిపాల్టీ నుంచే టీఆర్‌ఎస్‌ తొలి బోణీని కొట్ట గా తాజాగా సోమవారం సైతం మరో సీటును కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనం దం వ్యక్తమవుతున్నది. అయితే ఈ రెండు ఏకగ్రీవాలను నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఈ నెల 14న మధ్యాహ్నం తర్వాత 3గంటల తర్వాత ప్రకటించనున్నట్లు పెద్దపల్లి జిల్లా ఎన్నికల సహాయ అధికారి, పెద్దపల్లి మున్సిపాల్టీ ఇన్‌చార్జి కమిషనర్‌ వినోద్‌ తెలిపారు.

టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో ఆనందం..

పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 18, 21వ వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా బరిలోకి దిగిన కొలిపాక శ్రీనివాస్‌, చిట్టిరెడ్డి మమతారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఫలిస్తున్న ఎమ్మెల్యే ‘దాసరి’ మంత్రాంగం..

మున్సిపల్‌ ఎన్నికల్లో పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించేందుకు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి చేస్తున్న మంత్రాంగం ఫలిస్తున్నది. ఒక్క పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 36వార్డుల్లో ఇప్పటికే రెండు వార్డులు ఏకగ్రీవం కాగా మరో మూడు వార్డులను సైతం ఏకగ్రీవం చేసుకునేలా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌లో పెరుగుతున్న జోష్‌తో ఇప్పటికే మున్సిపల్‌ ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల అభ్యర్థులు ఢీలా పడిపోయారు. ఎమ్మెల్యే మం త్రాంగాన్ని చూసి ప్రతి పక్ష పార్టీల నేతలు కంగు తింటున్నారు. సుల్తానాబాద్‌లో సైతం ఒకటి రెండు స్థానాలాను ఏకగ్రీవం చేసేందుకు సైతం ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. రెండు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు బెంబేలెత్తుతున్నా రు. భారీ విజయాలను సొంతం చేసుకునేందుకు  టీఆర్‌ఎస్‌ నాయకులు ముందుకు సాగుతున్నారు.logo