శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 14, 2020 , 02:38:34

మేయర్‌ పీఠాన్ని కేటీఆర్‌కు కానుకగా ఇద్దాం

మేయర్‌ పీఠాన్ని కేటీఆర్‌కు కానుకగా ఇద్దాం


గోదావరిఖని, నమస్తే తెలంగాణ : రామగుండం మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం నల్లేరుపై నడకేననీ, ఈ గెలుపును మేయర్‌ పీఠాన్ని కేటీఆర్‌కు కానుకగా ఇద్దామని రాష్ట్ర ఎస్సీ  శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, నాయకులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ మహానేత దేశానికి ఆదర్శ సీఎంగా కీర్తించబడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనదక్షత, అభివృద్ధి సంక్షేమ పథకాలు టీఆర్‌ఎస్‌కు కొండంత బలంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలైనా టీఆర్‌ఎస్‌ విజయం తథ్యమన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం పాలన సాగుతుందన్నారు. ఆసరా పింఛన్లు, షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మీ, కేసీఆర్‌ కిట్‌ లాంటి పథకాలను అమలు చేసి అండగా నిలుస్తున్నారన్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మాట్లాడుతూ.. రామగుండం కార్పొరేషన్‌కు ఏటా వంద కోట్లు మంజూరు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు తీసుకవెళ్లాలనీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎన్నికలను సీరియస్‌గా తీసుకొని విజయం సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. 50 డివిజన్లలో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన కోరారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల అవకాశం రానివారికి భవిష్యత్‌లో సముచిత స్థానం కల్పిస్తామనీ, పార్టీ విజయానికి పాటుపడాలన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతి ఇంటి ముందు టీఆర్‌ఎస్‌ గుర్తు కారు గుర్తును ముగ్గులుగా వేసేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. మంత్రి చేతుల మీదుగా రామగుండం సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన 1800 5998 666 టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఆవిష్కరించారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా టోల్‌ ఫ్రీకి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావు తదితరులున్నారు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆశీర్వదించాలి

రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నదనీ, రామగుండం కార్పొరేషన్‌లో పోటీ పడుతున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కోరారు. 8వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రామగుండం కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ బలంగా ఉందనీ, ప్రతి ఇంటికి టీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారనీ, వారంతా టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బంపర్‌ మెజార్జీతో విజయం తథ్యమన్నారు. కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో 8వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఊట్ల శ్రీనివాస్‌ రెడ్డి, నాయకులు అల్లం ఐలయ్య, కేశవ్‌ గౌడ్‌, మల్లారెడ్డి, గనవేని సంపత్‌, నూనె సత్యనారాయణ, సకినాల ప్రతాప్‌, అహ్మద్‌ పాషా, పోశక్క తదితరులున్నారు.logo