శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 14, 2020 , 02:37:44

పట్టణాభివృద్ధి తెరాసతోనే సాధ్యం

పట్టణాభివృద్ధి తెరాసతోనే సాధ్యం


పెద్దపల్లి జంక్షన్‌ : పెద్దపల్లి పట్టణాభివృద్ధి తెరాసతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని 28వ వార్డులో చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌తో కలిసి ఎమ్మెల్యే దాసరి విస్తృత ప్రచారం చేశారు. పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 2 వార్డులు ఏకగ్రీవమయ్యేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే దాసరికి ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అభినందించారు. ఈ సందర్భంగా ఇంటింటా తిరుగుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి  మాట్లాడుతూ.. అభివృద్ధిని చూసి  టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రానున్న రోజుల్లో పెద్దపల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. వార్డుల్లో ప్రజలను ఎమ్మెల్యే దాసరి ఆప్యాయంగా పలికరిస్తూ కారు గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా పలువురు వార్డులోని సమస్యలను ఎమ్మెల్యే దాసరికి వివరించగా, ఎన్నికల అనంతరం పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందుకు ఎన్నికల ప్రచారానికి వార్డు వచ్చిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ ప్రచారంలో జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఉప్పు రాజ్‌కుమార్‌, కో ఆప్షన్‌ సభ్యుడు హబీబ్‌ ఉర్‌ రెహమాన్‌, నాయకులు గజవెల్లి పురుషోత్తం, ఉప్పు శివ, పడాల సతీశ్‌, ఎండీ. హబీబ్‌, గండు రంగయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కదిలిన గులాబీ దండు

పెద్దపల్లి జంక్షన్‌ / పెద్దపల్లి టౌన్‌ : పెద్దపల్లి మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. స్థానిక ఎమ్మెల్యే పెద్దపల్లిపై గులాబీ జెండా ఎగరవేయ్యాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే గడపగడపకూ తిరుగుతూ ఓట్లను అభ్యర్ధిస్తున్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్‌ శ్రేణులు దండులా కదిలారు. దీంతో ప్రత్యర్ధి పార్టీల అభ్యర్థులు  ఖంగుతింటున్నారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. పట్టణంలోని 17, 24 వార్డులలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పైడ రవి, జడల సురేందర్‌ తరుపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెద్దపల్లి పట్టణం మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటేసి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించాలన్నారు. ప్రచారంలో ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, పోసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కొమురయ్య, లక్ష్మణ్‌, పురోషోత్తం, గంట రమేశ్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.logo