బుధవారం 01 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 14, 2020 , 02:36:12

సబ్బండ వర్గాల అభివృద్ధే కేసీఆర్‌ ధ్యేయం

సబ్బండ వర్గాల అభివృద్ధే కేసీఆర్‌ ధ్యేయం

మంథని రూరల్‌ : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పని చేస్తున్నరని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు పేర్కొన్నారు. మండలంలోని కన్నాల గ్రామంలో రెడ్డి కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం కోసం రూ. 9.25 లక్షలను వెచ్చించి భవన నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా రెడ్డి కులస్తులు జడ్పీ చైర్మన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా పని చేస్తున్నదన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరి ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. మంథని మండలానికి పెద్దపీట వేస్తూ అన్ని రకాలుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కుల సంఘాల భలోపేతం కోసం అన్ని కులస్తులకు వారి కోరిక మేరకు సంఘ భవనాలను నిర్మించేలా కృషి చేస్తున్నామన్నారు. సంఘటితంగా ఉంటు గ్రామ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధి కోసం ప్రజలే ప్రణాళికలు వేసుకొని అభివృద్ధి చేసుకునేలా కేసీఆర్‌ ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదన్నారు. ఈ నిధులను సక్రమంగా వాడుకుంటూ, గ్రామ అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం లేనిది ఏ పని ముందుకు వెల్లదనీ, అందరూ కలసి కట్టుగా ఉండి వార్డుల వారికి అభివృద్ధి ప్రణాళికలు వేసుకోవాలనీ, అందుకు నిధులను కేటాయించే బాధ్యత మాపై ఉన్నదన్నారు. కన్నాల గ్రామంలో సిటిజన్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని జడ్పీ చైర్మన్‌ ప్రారంభించారు. మహిళల ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు ఈ కుట్టు శిక్షణ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కుట్టు శిక్షణ నేర్చుకొని వదిలేయకుండా షాపులను పెట్టుకొని పని చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్‌, జడ్పీటీసీ తగరం సుమలత, ఎంపీటీసీ మిరియాల ప్రసాద్‌రావు, సర్పంచ్‌ మంగ, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ గుడిసె గట్టయ్య, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు కనవేన శ్రీనివాస్‌ యాదవ్‌ నాయకులు తగరం శంకర్‌లాల్‌, సురేందర్‌రెడ్డి, ముస్కుల వెంకట్‌రెడ్డి, గుండ్రెడ్డి సుధాకర్‌రెడ్డి, పొయిల బాపు, రమేశ్‌ రెడ్డి, రమేశ్‌ గౌడ్‌, పుల్లారెడ్డి, సిటిజన్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజర్‌ దయారాజు, తదితరులు ఉన్నారు.


logo
>>>>>>