బుధవారం 08 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 13, 2020 , 03:48:16

టీఆర్‌ఎస్‌ను ఆదరించండి

టీఆర్‌ఎస్‌ను ఆదరించండి

మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని ఆదరించాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని పలు వార్డుల్లో ఆదివారం ఎమ్మెల్యే దాసరి కాలినడక విస్తృత ప్రచారం చేపట్టారు.

  • ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
  • పెద్దపల్లి పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం
  • కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి

కలెక్టరేట్‌: మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని ఆదరించాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని పలు వార్డుల్లో ఆదివారం ఎమ్మెల్యే దాసరి కాలినడక విస్తృత ప్రచారం చేపట్టారు. ఉదయం 7గంటలకు  పట్టణంలోని శాంతినగర్‌లో గల కోదండరామాలయం, షిర్డీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. 2, 3, 4,5,6వ వార్డుల్లో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో కలిసి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. వార్డుల్లో గడపడపకూ వెళ్లి వృద్ధులు, దివ్యాంగులను ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమ లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలన్నారు. గత నాలుగేళ్ల క్రితం పెద్దపల్లి పట్టణం ఏ మాదిరిగా ఉండేది, ప్రస్తుతం ఎలా అభివృద్ధి చెందిందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందన్నారు. గతంలో ఈ నియోజకవర్గాన్ని ఎవరూ పట్టించుకుని అభివృద్ధి చేసిన పాపాన పోలేదన్నారు. మంచినీటి కొరత, కరెంట్‌ కోత అంశాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ను అమలు చేస్తుందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే రాబోయే రోజుల్లో పెద్దపల్లి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి ముందుకుతీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ మున్సిపాల్టీపై టీఆర్‌ఎస్‌ జెండా ను ఎగురవేసి సీఎం కేసీఆర్‌కు బహుమానంగా పంపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, నాయకులు బండారి శ్రీనివాస్‌గౌడ్‌, మేకల మల్లేశం, ఎండీ హబీబ్‌, గజవెల్లి పురుషోత్తం, డాక్టర్‌ అజీజ్‌, పస్తం జంపయ్య, తబ్రేజ్‌ పాల్గొన్నారు. 


21వ వార్డులో..

పెద్దపల్లిటౌన్‌: పట్టణంలోని 21వ వార్డులో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ట్రినిటీ డిగ్రీ కళాశాల సమీపం నుంచి ప్రచారాన్ని ప్రారంభించి ఇంటింటికి తిరుగుతూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. అలాగే టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున నామినేషన్‌ వేసిన ఉప్పు కృష్ణమూర్తి పట్టణంలోని ప్రజలను, వ్యాపారులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. నాయకులు, కార్యకర్తలున్నారు.


టీఆర్‌ఎస్‌లో చేరికలు

కలెక్టరేట్‌: పెద్దపల్లి అభివృద్ధిని కాంక్షిస్తున్న వారంతా టీఆర్‌ఎస్‌తో కలిసి రావాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం 18వవార్డుకు చెందిన పలువురు బీజేపీ సీనియర్‌ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరగా, వారికి ఎమ్మెల్యే కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు గరిగంటి సత్తయ్య, నాయకులు నక్క సతీశ్‌, నక్క రమేశ్‌, మౌటం శంకర్‌, కొలిపాక రాజేశం, దయ్యాల రాజేశంలు టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ఉన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు కొలిపాక నర్సయ్య, ఉప్పు రాజ్‌కుమార్‌, తబ్రేజ్‌, కొలిపాక శ్రీనివాస్‌, చిరంజీవి, రాము, దయ్యాల శివ, ఇలవేని శ్రీనివాస్‌, కొలిపాక రాజేశం, కొలిపాక కృష్ణ తదితరులున్నారు.


logo