మంగళవారం 31 మార్చి 2020
Peddapalli - Jan 13, 2020 , 03:47:36

రామగుండంలో టీఆర్‌ఎస్‌ రెండో జాబితా

రామగుండంలో టీఆర్‌ఎస్‌ రెండో జాబితా
  • కార్పొరేషన్‌లో మరో నలుగురి పేర్లు ప్రకటించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌
  • 31 డివిజన్లలో ఖరారైన గులాబీ అభ్యర్థులు

గోదావరిఖని టౌన్‌ : రామగుండం నగర పాలక సంస్థ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మరో నలుగురు అభ్యర్థులను ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ప్రకటించారు. ఈ మేరకు 9వ డివిజన్‌ (ఎస్సీ మహిళ) నుంచి తోకల దీప, 10వ డివిజన్‌ (బీసీ జనరల్‌)లో అడ్డాల గట్టయ్య, 21వ డివిజన్‌ (బీసీ మహిళ)లో బొడ్డుపల్లి సరిత, 35వ డివిజన్‌ (జనరల్‌)లో గుండు రాజు పేరును ఎమ్మెల్యే అధికారికంగా ఖరారు చేశారు. రామగుండంలోని 50 డివిజన్లకు 27 మందిని ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకూ 31వ డివిజన్లలో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసే 31 మంది అభ్యర్థులను ఖరారు చేయగా, మరో 19 మందిని సోమవారం ఉదయం ప్రకటించనున్నారు. 50 మంది అభ్య ర్థులు ఖరారయ్యాక, మధ్యాహ్నం వరకు అందరికీ టీఆర్‌ఎస్‌ బీ ఫాం లు ఇవ్వనున్నారు. అధికార పార్టీ తరపున పోటీ చేసేందుకు మరో 19 మందికి అవకాశం ఉండ గా, అభ్యర్థులతోపాటు ఆయా వార్డు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. logo
>>>>>>