సోమవారం 30 మార్చి 2020
Peddapalli - Jan 13, 2020 , 03:45:08

వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి

వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి

స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి వినోద్‌ పేర్కొన్నారు. జాతీ య యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం వేడుకలను నిర్వహించారు.

కలెక్టరేట్‌: స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి వినోద్‌ పేర్కొన్నారు. జాతీ య యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భం గా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ కార్యాలయ ఏఓ కేవైకే ప్రసాద్‌,  యువజన క్రీడల శాఖాధికారి రాజవీరు, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి ఇస్మాయిల్‌, తాసిల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌, యువజన సంఘాల నాయకులు విజయ్‌, శివంగారి సతీశ్‌, రాజు పాల్గొన్నారు. 


పండ్లు పంపిణీ

పెద్దపల్లిటౌన్‌: పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో ఆదివారం శ్రీవివేకానంద సింగరేణి ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు.   కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు తక్కళ్ల రాము లు, ప్రధాన కార్యదర్శి పులిపాక రాజన్న, కోశాధికారి శ్రీనివాసరాజు, సభ్యులు సుధాకర్‌, సదయ్య, శ్రీనివాస్‌, ముజఫర్‌ అలీ, సదానందం, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 


కాల్వశ్రీరాంపూర్‌ : మండలకేంద్రంతో పాటు, మంగపేటలో స్వామి జయంతిని ఆదివారం ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకా నందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. కార్యక్రమాల్లో వివేకానంద యూత్‌ సభ్యులు, జాతీయ యువజన వాలంటీర్‌ దాము క సుజిత్‌కుమార్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యవాహ ప్రాయకరావు నాగరాజు, యువజన సంఘం అధ్యక్షుడు దాముక అచ్యుత్‌కుమార్‌, సభ్యులు తిరుమల రాజు, గడమల్ల రాకేశ్‌, గిరుగుల సురేశ్‌, సమ్మెట శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 


సుల్తానాబాద్‌రూరల్‌: మండలంలోని గర్రెపల్లి ప్రాథమిక పాఠశాల, భూపతిపూర్‌లో ఆదివారం స్వామి వివేకానంద జయంతి వేడుకలను చేపట్టి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయు డు తులా సుధాకర్‌రావు, ఎస్‌ఎంసీ చైర్మన్లు మాదాసు మధుసూదన్‌, జెట్టి సంపత్‌, ఉపాధ్యాయులు స్రవంతి, నాయకులు రాజు, సంపత్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు. 


పెద్దపల్లి జంక్షన్‌: పెద్దపల్లి మండలంలో స్వామి  జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గౌరెడ్డిపేటలో శివాజీ, నెహ్రూ యువసేన ఆధ్వర్యంలో జయంతి వేడుకలను చేపట్టగా, సర్పంచ్‌ కొమ్ము శ్రీనివాస్‌ పాల్గొని వివేకానంద చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శివాజీ యువసేన అధ్యక్షుడు కొమ్ము ప్రశాంత్‌, నెహ్రూ యువకేంద్ర సభ్యులు పుధ్వీదర్‌రెడ్డి, సెక్రటరీ సతీశ్‌, ప్రతిభ, స్రవంతి, స్వప్న, వాణి తదితరులు పాల్గొన్నారు. 

సుల్తానాబాద్‌ : మీ సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వామి జయంతి వేడుకలు సుల్తానాబాద్‌లో చేపట్టగా, మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు హాజరై వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే ఏబీవీపీ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్ర మాల్లో సామల రాజేంద్రప్రసాద్‌, హరికృష్ణ, సాదుల సుగుణా కర్‌, పెందోట వెంకటేశ్వర్లు, దూడం లింగమూర్తి, గజభీంకార్‌ జితేందర్‌, జూపాక కుమారస్వామి, పాక మహేశ్‌, నాంపెల్లి విజయ్‌కుమార్‌, రాసూరి ప్రవీణ్‌, చింకు,  శివకుమార్‌, నాగరాజు, సిద్దు, అజయ్‌, రాజు, సతీశ్‌ తదితరులున్నారు.   


స్ఫూర్తితో ముందుకెళ్లాలి

జూలపల్లి : విద్యార్థులు, యువత స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి పిలుపునిచ్చారు. మండల కేం ద్రంలోని మందోట ప్రాంతంలో ఆదివారం స్వా మి వివేకానంద జయంతి వేడుకలు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎం పీపీ స్వామి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, అతి చిన్న వయసులో స్వామి వివేకానంద దేశ సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు అమరగాని మమత, ఏఎంసీ చైర్మన్‌ ఏదుల్ల కన్కయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్‌ పాటకుల అనిల్‌, నాయకులు మల్లెత్తుల ఆంజనేయులు, కూసుకుంట్ల రాంగోపాల్‌రెడ్డి, మేర్గు రమేశ్‌, ఉప్పుల తిరుపతి, కోడూరి మహేశ్‌, దీకొండ ఆంజనేయులు, గోనె పర్శరాములు, మేర్గు కన్కయ్య, పొరండ్ల తిరుపతి, గంగిపెల్లి విద్యాసాగర్‌, రవి, అజేయ్‌ పాల్గొన్నారు. 


ఎలిగేడు(జూలపల్లి) : ఎలిగేడు మండలం ధూళికట్టలో ఆదివారం స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా గ్రామస్తులు వివేకానంద చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు నరేశ్‌యాదవ్‌, శ్రీనివాస్‌, భూసారపు తిలక్‌, రంగు నవీన్‌, వీరగోని పర్శరాములు, భూసారపు శ్రీకాంత్‌, చియాగౌడ్‌, అశోక్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


ధర్మారం:   మండలంలోని పలు గ్రామాల్లో వివేకానంద జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఖిలావనపర్తిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో యువకులు స్వామి చిత్ర పటానికి పూల వేసి నివాళులర్పించారు. అలాగే ధర్మారం సాయి మణికంఠ ఉన్నత పాఠశాలలో జయంతిని ఆ విద్యాలయం ఎండీ జైన రమాదేవి ఆధ్వర్యంలో చేపట్టి, స్వామి చిత్ర పటానికి పూలమాల వేశారు. ఖిలావనపర్తిలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌ బోధించేందుకు ఎండీ రఫీ ముందుకు రాగా, విద్యార్థులందరికీ టైబెల్ట్‌లు కొని ఉచితంగా పంపిణీ చేసేందుకు  ఎంపీటీసీ సభ్యురాలు మోతె సుజాత కనకయ్య, చొప్పరి క్రిష్ణ ముందుకు వచ్చారు. కార్యక్రమంలో కీసరి స్వామి,అజయ్‌, వెంకటేశ్‌, సాగంటి నరేశ్‌, పిట్టల సతీశ్‌, దేవేందర్‌,రమేశ్‌, అనిల్‌,వీరబత్తిని సతీశ్‌, శ్రీనివాస్‌, హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo