మంగళవారం 31 మార్చి 2020
Peddapalli - Jan 12, 2020 , 03:24:45

క్రీడల్లో గెలుపోటములు సహజం

క్రీడల్లో గెలుపోటములు సహజంధర్మారం: క్రీడల్లో గెలుపోటమలు సహజమని పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్‌ అన్నారు. మండలంలోని నందిమేడారంలో గల బాలుర గురుకుల విద్యాలయంలో ఈనెల 9న ప్రారంభమైన రాష్ట్రస్థాయి టెన్నికాయిట్‌ పోటీలు శనివారం ముగిసాయి. బాలుర విభాగంలో కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌ జట్టు, బాలికల విభాగంలో మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌ జట్లు చాంపియన్లుగా నిలిచాయి. బాలికల విభాగంలో సీ సురేఖ(మహబూబ్‌నగర్‌), జే రమ్య(వరంగల్‌), ఎం దుర్గాభవాని, బీ నవ్యశ్రీ(ఖమ్మం), ఐ వర్షిణి (కరీంనగర్‌), బాలుర విభాగంలో జే రవికుమార్‌ (వరంగల్‌), ఆర్‌ రాజ్‌కుమార్‌, పీ అంజయ్య(కరీంనగర్‌), కే విఘ్నేశ్వర్‌(రంగారెడ్డి), జీ తేజవర్ధన్‌ (వరంగల్‌)లు జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైనట్లు జిలా కార్యదర్శి శ్రీనివాస్‌ తెలిపారు. వీరు ఈనెల 22నుంచి 26వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నెల్లూరులో జరిగే జాతీయస్థాయి పోటీ ల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

కాగా ముగింపు పోటీలకు పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్‌ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. కార్యక్రమానికి ఎంఈఓ ఛాయదేవి అధ్యక్షత వహించగా, గురుకుల ప్రిన్సిపాల్‌ సుస్మి త, గ్రామ సర్పంచ్‌ సామంతుల జానకి, ఎంపీటీసీ సభ్యులు కట్టా సరోజ, మిట్ట తిరుపతి, ఉపసర్పం చ్‌ కట్ట రమేశ్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ సలామొద్దీన్‌, క్రీడల పరిశీలకుడు ఆర్‌ రాజ్‌కుమార్‌, జిల్లా పీఈటీల అధ్యక్షుడు డీ వీరన్న, జగన్‌, కార్యదర్శులు రమేశ్‌, తమ్మనవేణి రాజ య్య, రాష్ట్ర బాధ్యులు సీ శ్రీనివాసరావు, ఎస్జీఎఫ్‌ మండల కార్యదర్శి బీ సత్యనారాయణ, పీఈటీలు తుమ్మల సౌజన్య, మిట్ట భరత్‌, రమేశ్‌, రాజ్‌కుమార్‌, శ్రీనివాస్‌, రవికుమార్‌తోపాటు క్రీడాకారు లు పాల్గొన్నారు.


logo
>>>>>>