శనివారం 28 మార్చి 2020
Peddapalli - Jan 12, 2020 , 03:24:25

డెమొక్రసీ అవార్డులు

డెమొక్రసీ అవార్డులుపెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన తెలంగాణ డెమోక్రసీ అవార్డుల్లో జిల్లాకు చెందిన ఆరుగురు అధికారులకు అవార్డులు లభించాయి. పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించినందుకు గాను జిల్లా పంచాయతీ అధికారి వేముల సుదర్శన్‌, జడ్పీ సీఈవో వినోద్‌కుమార్‌, పెద్దపల్లి ఎంపీడీవో ఎం రాజు, ముత్తారం ఎంపీడీవో ఎం మణికంటేశ్‌, ఈ-పంచాయతీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ మహ్మద్‌ రజాక్‌, సుల్తానాబాద్‌ సీఐ మహేందర్‌రెడ్డిలు అవార్డులు అందుకున్నారు. హైదరాబాద్‌లోని తర్మాటి భరాద్రి ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా అధికారులు అవార్డులు అందుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.


logo