మంగళవారం 31 మార్చి 2020
Peddapalli - Jan 12, 2020 , 03:22:42

ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి

ఆరుతడి పంటలపై దృష్టి సారించాలికాల్వశ్రీరాంపూర్‌ : రైతులు రబీ సాగులో ఎక్కువగా ఆరుతడి పంటలపై దృష్టి సారించాలనీ, మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న వాటిని సాగు చేయాలని ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గంగారంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడా రు. వ్యవసాయ రంగాన్ని గత ప్రభుత్వాలు  నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ బీడు భూములకు సాగునీరందించాలనే ఉద్దేశ్యంతో ప్రాజెక్టుల రూపకల్పన చేశారని  వివరించారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 1,92,280 ఎకరాల ఆయక ట్టు సాగైందని వివరించారు. సాగు చేసిన పం టల్లో రైతులు అధిక బాగం వరి వేశారని తెలిపా రు. యాసంగిలో కూడా వరి వేసేందుకు రైతులు ఎక్కువగా సిద్ధమవుతున్నారని చెప్పారు.

రైతులు  వరిపై మొగ్గు చూపకుండా వాణిజ్య పంటలైన మక్క, మిరప, కంది, నువ్వులు, తదితర తృణ ధాన్యాల పంటలను వేసుకోవాలని సూచించారు. రైతు సమన్వయ సమితి సభ్యులతోపాటు, వ్యవసాయ అధికారులు రైతులకు ఆరుతడి, మార్కెట్‌ లో డిమాండ్‌ ఉన్న పంటలపై అవగాహన కల్పిం చి, సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాబోవు రోజుల్లో సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగంపై విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నారని గుర్తు చేశారు. సమావేశంలో సర్పంచులు కొనుకటి మల్లారెడ్డి, భైరం రమేశ్‌, నాయకులు కదురు సతీశ్‌, కూస సతీశ్‌, గుడ్ల శ్రీనివాస్‌, చీర ఓదెలు, చంద్రయ్య, ఆవుల తిరుపతి,  ఐలయ్య, భైరి రాంమూర్తి తదితరులున్నారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ

కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని గంగారం పరిధిలోని ఊషన్నపల్లె గ్రామంలో బాలె చంద్రమ్మ, మేడిద రాయమల్లు ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబ సభ్యులను ఐడీసీ చైర్మన్‌ శంకర్‌రెడ్డి పరామర్శించారు, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.


logo
>>>>>>