మంగళవారం 31 మార్చి 2020
Peddapalli - Jan 12, 2020 , 03:21:03

ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

కలెక్టరేట్‌: సంక్రాంతి లక్ష్మితో ప్రజలంతా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని పెద్దపల్లి ఎమ్మె ల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆకాంక్షించారు. పెద్దపల్లి ట్రినిటీ ప్రైమరీ పాఠశాలలో శనివారం ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సంప్రదాయ పద్ధతిలో భోగి మంటలు కాల్చి పాఠశాల ప్రాంగణమంతా అందాల ముగ్గులతో అలంకరించారు. గొబ్బెమలు, గంగిరెద్దులు, హరిదాసుల వేషధారణల్లో చిన్నారులు సంబురాలు చేసుకోగా ఎమ్మెల్యే సైతం వారితో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ డీఎస్‌ కుమార్‌, పీఈటీ షఫీయొద్దీన్‌, ఉపాధ్యాయులు రమాదేవి, ప్రతిమ, సుభద్ర, రుబీనా, విజయలత తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జంక్షన్‌: పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం ముం దస్తు సంక్రాంతి వేడుకలను చేపట్టగా, ఎంపీపీ స్రవంతి హాజరై చిన్నారులకు గాలిపటాలు ఇచ్చి, వారితో పాటు ఎగురవేశారు. అనంతరం సకినాలను చిన్నారులకు ఉపాధ్యాయులు అందించారు.

పెద్దపల్లిటౌన్‌: పెద్దపల్లిలోని ట్రినిటీ సెకండరీ పాఠశాల, గాయత్రి పాఠశాల, పల్లవి మోడల్‌ స్కూల్‌, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఆవరణలో ముందస్తు సంక్రాంతి సంబురాలను చేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలల క్రీడా మైదానంలో విద్యార్థులు ముగ్గులు వేశారు.  కార్యక్రమంలో ట్రినిటీ సెకండరీ హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ నాగేశ్వర్‌రావు, గాయత్రి పాఠశాల కరస్పాండెంట్‌ అల్లెంకి రజని శ్రీనివాస్‌, పల్లవి మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ వాణి, కరస్పాండెంట్‌ శోభారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జూలపల్లి : మండల కేంద్రంలోని ‘న్యూ బ్రిలియంట్‌' ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాం తి వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు పోటీ పడుతూ రంగు రంగుల ముగ్గులు వేశారు. మైదానంలో గాలి పటాలు ఎగుర వేసి కేరింతలు కొడుతూ సంబురాలు చేసుకున్నారు.  పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినం దించారు. ఇక్కడ పాఠశాల హెచ్‌ఎం కొండ సత్యం, కరస్పాండెంట్‌ కొండ ప్రసాద్‌, కోడూరి శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ధర్మారం: ధర్మారం

మండలం నందిమేడారం, శాయంపేట గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో శనివారం విద్యార్థులు ముందస్తు సంక్రాంతి పండుగ సంబురాలు చేసుకున్నారు. ఆయా పాఠశాలల విద్యార్థులు అందమైన ముగ్గులు వేశారు. ఆనందంతో పతంగులు ఎగురవేశారు. కార్యక్ర మంలో హెచ్‌ఎంలు రాజారాం, జాడి శ్రీనివాస్‌ తదితరులున్నారు. అలాగే ధర్మారంలోని సాందీపని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు  ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు  కరస్పాండెంట్‌ రామారావు బహుమతులు అందజేశారు.
పెద్దపల్లి టౌన్‌: పెద్దపల్లి గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాల ఆవరణలో శనివారం ముందస్తు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాతా స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆర్గనైజర్‌ మూల విజయారెడ్డి ముగ్గులను పరిశీలించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో  విద్యా సంస్థల చైర్మన్‌ అల్లెంకి శ్రీనివాస్‌, కళాశాల ప్రిన్సిపాళ్లు సురేశ్‌, రవీందర్‌, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. 

సుల్తానాబాద్‌రూరల్‌: భూపతిపూర్‌ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో భోగి మంటలు, ముగ్గులు వేయగా, హరిదాసులు గా విద్యా ర్థులు మారారు. గర్రెపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో పతంగులను ఎగుర వేయించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం తుళ్ల సుధాకర్‌రావు, జీసీడీఓ పద్మ,ఎస్‌ఓ స్వప్న, ఉపాధ్యాయులు కవిత, శ్రీధర్‌, సవంత్రి, రమ తదితరులు ఉన్నారు.

కాల్వశ్రీరాంపూర్‌ : మండలంలోని ఇద్లాపూర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో  ముందస్తుగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం చిన్నారులతో పతంగులు ఎగురవేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం జితేందర్‌రెడ్డి, ఉపాధ్యాయ సిబ్బంది శ్రీనివాస్‌, శంకర్‌, కోటేశ్వర్‌, అంగన్‌వాడీ టీచర్‌ శారద తదితరులున్నారు.
ఓదెల: ఓదెల కస్తూర్బాగాంధీ విద్యాలయంలో ముందస్తుగా సంక్రాంతి వేడుకలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఓ మాధవి మాట్లాడారు.


logo
>>>>>>