గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 09, 2020 , 17:31:19

ఎన్ 5 ప్యానల్ పనులు భేష్

ఎన్ 5 ప్యానల్ పనులు భేష్

జైపూర్: శ్రీరాంపూర్ డివిజన్‌లోని ఇందారంఖని 1ఏ భూగర్భగనిలో ఎన్5 బొగ్గు ఉత్పత్తి పని ప్రదేశంలో చేపట్టిన రక్షణ పనులపై డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ మహ్మద్ నియాజ్ సందర్శించారు. మంగళవారం శ్రీరాంపూర్ జీఎం లక్ష్మీనారాయణతో కలిసి సందర్శించిన ఆయన ఐకే 1ఏ గనిలో ఎన్ 5 ప్యానల్ ప్రారంభించేందుకు అనుమతుల ఇవ్వనున్న నేపథ్యంలో గనిని సందర్శించారు. ప్యానల్‌కు సంబంధించి సేఫ్టీ కండిషన్, గాలి, వెలుతురు మిగి తా అన్ని కండిషన్‌లతో మిగితా సౌకర్యాలు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్యానల్ ప్రారంభానికి అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం మ్యాన్‌రైడింగ్ ద్వారా అధికారులతో కలిసి భూగర్భంలోకి దిగారు. పని స్థలాలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు రక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జీఎం సేఫ్టీ బల్లారి శ్రీనివాస్, ఐకే ఓసీ పీఓ రాజేశ్వర్‌రెడ్డి, గని మేనేజర్ శ్రీధర్, ఓసీ మేనేజర్ సత్యనారాయణ, గ్రూప్ ఇంజినీర్లు బస్వరాజు, ఆత్మరాం, నజీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

బోల్టర్‌మైనర్ పరిశీలన
త్వరలో ప్రారంభంకానున్న శాంతిఖని లాంగ్‌వాల్‌ప్రాజెక్టును డిప్యూ టీ డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ (ఎలక్ట్రికల్ హైదరాబాద్ రీజియన్ -2) కే రాజు మంగళవారం సందర్శించారు. రూ.100 కోట్లతో ఇటీవలనే శాంతిఖగనిలో ప్రవేశపెట్టిన బోల్టర్‌మైనర్‌ను పరిశీలించారు. గనిలోకి దిగి బోల్టర్ మైనర్ యంత్రాన్ని చూశారు. దాని పనితీరును గని అధికారులను అడిగి తెలుసుకున్నారు. బోల్టర్ మైనర్ బొగ్గు ఉత్పత్తికి అన్నిరకాలుగా సిద్ధం చేశామని వివరించారు. ట్రయల్ రన్ కూడా నిర్వహించినట్లు తెలిపారు. బోల్టర్‌మైనర్ పనితీరు అన్నివిధాలుగా మెరుగ్గా ఉందని డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ రాజుకు అధికారులు విశదీకరించారు. శాంతిఖనిలో బోల్టర్‌మైనర్‌తో ఉత్పత్తికి ముహూర్తం ఖరారు కానున్నది. ఈ నేపథ్యంలోనే మైనింగ్ సేఫ్టీ అధికారి రాజు బోల్టర్ మైనర్ పనితీరును పరిశీలించారు. గనిని పరిశీలనకు డైరెక్టర్ వెంట శాంతిఖని ప్రాజెక్టు కే వెంకటేశ్వర్లు, ఏరియా ఇంజినీర్ జగన్‌మోహన్, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ ఇంజినీర్ బాలాజీ భగవతిజా, శాంతిఖని గ్రూప్ ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఏరియా సేప్టీ ఆఫీసర్ ఓదెలు, శాంతిఖని మేనేజర్ భిక్షమయ్య ఫిట్ ఇంజినీర్ రమప్రసాద్, ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆఫీసర్ రాంబాబు ఉన్నారు.


logo