ఆదివారం 24 మే 2020
Peddapalli - Jan 09, 2020 , 17:30:11

భారీ మెజార్టీతో గెలిపించాలి

భారీ మెజార్టీతో గెలిపించాలి

జ్యోతినగర్‌: నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రజలు అన్ని వార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. బుధవారం ఎన్టీపీసీ పట్టణంలోని 3,4 డివిజన్లలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు టీఆర్‌ఎస్‌కు కొండంత బలమని ఉద్ఘాటించారు. పథకాలతో ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రామగుండం మేయర్‌ పీఠం కూడా టీఆర్‌ఎస్‌కే దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రజాసంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పరిపాలన సాగుస్తున్నార ని చెప్పారు. రామగుండంలో 10 ఏళ్లుగా పాలన చేసిన నాయకులు, ఈ ప్రాంతానికి ఏమి చేయకుండానే పార్టీలు మారి మళ్లీ ప్రజలను మభ్య పెట్టేందుకు వస్తున్నారని, వారిని ప్రజలు నమ్మె పరిస్థితుల్లో లేరని టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే ఆయా డివిజన్ల ఓటర్లను కోరారు. అంతకుముందు ఎమ్మెల్యే ఒకటో డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఆ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బద్రి రాజును ప్రకటించారు. అనంతరం ఎన్టీపీసీ ప్రచారంలో మూడో డివిజన్‌ అభ్యర్థిగా కుమ్మరి శ్రీనివాస్‌, నాల్గో డివిజన్‌ అభ్యర్థిగా నడిపెల్లి అభిషేక్‌రావును ప్రకటించారు. ఇక్కడ జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, నాయకులు బద్రిరాజు, రజిత, తస్లిమా భాను, దీటి బాలరాజ్‌, సాగర్‌రావు, అభిషేక్‌రావు, కుమ్మరి శ్రీనివాస్‌, చెప్యాల రామారావు, మల్లారెడ్డి, రమణారెడ్డి, తూంపద్మ, అనిల్‌రావు, భరత్‌గౌడ్‌ ఉన్నారు.


logo