శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 09, 2020 , 17:29:44

వృద్ధురాలి భర్త చికిత్సకు మంత్రి సాయం

వృద్ధురాలి భర్త చికిత్సకు మంత్రి సాయం

ధర్మారం: ధర్మారం మండలంలోని కొత్తపల్లి (న్యూ) గ్రామంలో యాదగిరి లక్ష్మి అనే వృద్ధురాలికి రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సాయం అందించారు. పల్లె ప్రగతి -2 లో భాగంగా ఆ గ్రామానికి మంత్రి రాగా, వృద్ధురాలు లక్ష్మి ఆయన దగ్గరకు వచ్చిన తన భర్త వెంకటి పక్షవాతంతో మంచ పట్టాడని, ఆయనకు చికిత్స చేయించే స్థోమత లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. తన భర్తను దవాఖానకు తీసుకెళ్లాలనీ, తన భర్త, తాను ఎట్ల బతుకుడు అంటూ మంత్రి ఎదుట వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. దీంతో సదరు వృద్ధురాలి దైనందిన స్థితిని, ఆవేదనను గమనించిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చలించి పోయి వెంటనే ఎల్‌ఎం ట్రస్ట్‌ తరపున రూ.10 వేల సాయాన్ని అందజేసి తన ఔదార్యాన్ని చాటారు. సాయం చేసిన మంత్రి ఈశ్వర్‌కు సదరు వృద్ధురాలు కృతజ్ఞతలు తెలిపింది.


logo