e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home జిల్లాలు ప్రైవేటీకరణ చర్యలను ఉపసంహరించుకోవాలి

ప్రైవేటీకరణ చర్యలను ఉపసంహరించుకోవాలి

ప్రైవేటీకరణ చర్యలను ఉపసంహరించుకోవాలి

తెలంగాణ పవర్‌ డిప్లొమా ఇంజినీరింగ్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి రవీందర్‌
పెద్దపల్లిటౌన్‌, జూలై 19: కేంద్రప్రభుత్వం విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణ చర్యలను ఉపసంహరించుకోవాలని తెలంగాణ పవర్‌ డిప్లొమా ఇంజినీరింగ్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి బొంకూరి రవీందర్‌ డిమాండ్‌ చేశారు. పెద్దపల్లిలోని ఎస్‌ఈ కార్యాలయం ఎదుట సోమవారం ఆ అసోసియేషన్‌ బాధ్యులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యుత్‌శాఖ ప్రైవేటీకరణతో వినియోగదారులకు భారీగా నష్టపోతారని వివరించారు. ఉద్యోగులకు పనిభారం పెరగడం తోపాటు ఉద్యోగ భద్రత కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈపీఎఫ్‌ విధానాన్ని రద్దు చేయాలని, జీపీఎఫ్‌ విధానాన్ని కొనసాగించాలని కోరారు. కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ 1104 యూనియన్‌ నాయకులు రామానుజం, ప్రభాకర్‌, 327 యూనియన్‌ నాయకులు సూర్యనారాయణ, ఎస్‌ఈ గంగాధర్‌, డీఈ ఈశ్వర్‌ప్రసాద్‌, ఏవోలు లక్ష్మయ్య, శ్యాం, ఏఈలు వెంకటనారాయణ, శ్రీనివాస్‌, ప్రకాశ్‌, సురేశ్‌ తదితరులున్నారు.
సుల్తానాబాద్‌, జూలై 19 : సుల్తానాబాద్‌ ఈఆర్‌వో కార్యాలయంలో విద్యుత్‌ సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. ఈ బిల్లుతో ఉద్యోగులు, విద్యుత్‌ వినియోగదారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏవోలు గజన్‌లాల్‌, బీ శ్రీనివాస్‌, మల్లేశం, ఎస్‌ మహేందర్‌, సంపత్‌రెడ్డి, నాగిన్‌, వెంకట్‌, ఆర్‌ అంజయ్య, సీహెచ్‌ నవీన్‌, ఎల్‌డీసీలు వెంకటేశ్‌, బషీర్‌, సౌందర్యరాణి, కే తిరుమల, డీ శివాణి, ఈ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రైవేటీకరణ చర్యలను ఉపసంహరించుకోవాలి
ప్రైవేటీకరణ చర్యలను ఉపసంహరించుకోవాలి
ప్రైవేటీకరణ చర్యలను ఉపసంహరించుకోవాలి

ట్రెండింగ్‌

Advertisement