e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home కరీంనగర్ నూతన విధానాలపై దృష్టి పెట్టండి

నూతన విధానాలపై దృష్టి పెట్టండి

నూతన విధానాలపై దృష్టి పెట్టండి

జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్‌
రైతులకు అవగాహన సదస్సులు

ధర్మారం, జూలై 19: రైతులు నూతన వ్యవసాయ సాగు విధానాలపై దృష్టి పెట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్‌ సూచించారు. ఈ మేరకు ధర్మారం మండలం నంది మే డారం గ్రామంలోని రైతు వేదికలో సోమవారం క్లస్టర్‌ రైతుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. నూతన వ్యవసాయ పద్ధతులు, వాన కాలం పంటల సాగులో మెళకువలు, పంట మా ర్పిడి, నమోదు, ఆయిల్‌ ఫామ్‌ సాగు, ఎరువుల వినియోగం తదితర అంశాలపై రైతులకు ఆయన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ, కాలానికి అనుగుణంగా నూతన సాగు విధానాలు చేపట్టడంతో గణనీయమైన లాభాలు పొందవచ్చని వివరించారు. పంట మార్పిడి విధానాన్ని రైతులు అలవర్చుకోవాలని సూచించారు. 20 నుంచి 25 రోజుల కాల పరిమితిలో పెంచిన వరి నారును చదరపు మీటర్‌కు 55 మొక్కలు ఉండేలా నాటు వేసుకోవాలని వివరించారు. వరి నార్లు పోయడం ఆలస్యమైతే విత్తనా లు వెదజల్లడం ఎంతో ఉత్తమమని స్పష్టం చేశా రు. పత్తిలో తరచూ అంతర కృషి చేయడంతో భూమి గుళ్లగా మారి కలుపు మొక్కలను నివారిస్తుందని వివరించారు. సమావేశంలో సర్పంచ్‌ సామంతుల జానకి, ఏవో ఎస్‌ఎంఎస్‌ పూర్ణిమ, ఏఈవో ఏ రాంచంద్రం పాల్గొన్నారు.
రామగిరి, జూలై 19: పంట మార్పిడి విధానంపై ఏవో భూక్యా మోహన్‌ రైతులకు అవగాహన కల్పించారు. రత్నాపూర్‌, ఆదివారంపేట, సుందిళ్లలోని రైతు వేదికల్లో పంట మార్పిడి విధా నం, ఇతర వాణిజ్య పంటలపై పలు సూచనలు చేశారు. కూరగాయలు, ఆయిల్‌పామ్‌, పసుపు, అల్లం, మిర్చి తదితర పంటలను కూడా సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పల్లె ప్రతిమ, వైస్‌ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి, ఎంపీటీసీ ధర్ముల రాజసంపత్‌, మండల రైతు బంధు సమితి కన్వీనర్‌ మేదరవేని కుమార్‌, ఆర్‌బీఎస్‌ గ్రామ కన్వీనర్‌ సాగర్ల తిరుపతి, ఏఈవోలు గుమ్మడి రమ్య, జ్యోత్స్న, వేల్పుల నవీన్‌ తదితరులు ఉన్నారు.
కమాన్‌పూర్‌, జూలై 19: లింగాల, గుండారంలోని రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎరువులు – యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సులు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఏవో బండి ప్రమోద్‌ కుమార్‌ మాట్లాడారు. కార్యక్రమాల్లో సర్పంచులు ఇటవేన కొమురమ్మ, కట్కం రవీందర్‌, ఆకుల ఓదెలు, ఆర్‌బీఎస్‌ మండల కోఆర్డినేటర్‌ పొనగంటి కనకయ్య, ఏఈవోలు సురేశ్‌, శ్రీనివాస్‌, ఆర్‌బీఎస్‌ బాధ్యుడు బొల్లపెల్లి శంకర్‌గౌడ్‌ పాల్గొన్నారు.
పాలకుర్తి, జూలై 19: పాలకుర్తి మండల రైతువేదిక భవనంలో రైతులకు పంటమార్పిడి విధానంపై ఏఈవో శశిధర్‌ అవగాహన కల్పించారు. తరచూ ఒకే రకమైన పంట వేయడంతో భూమి లో సారం కోల్పోయి, దిగుబడి తగ్గుతుందని వివరించారు. తెగుళ్ల ఉధృతి కూడా పెరిగి రైతులు ఆర్థికంగా నష్టపోతారని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ వ్యాళ్ల అనసూర్యారాంరెడ్డి, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, వైస్‌ ఎంపీపీ ఎర్రం స్వామి, ఏఎంసీ చైర్మన్‌ అల్లం రాజయ్య, సర్పంచ్‌ దుర్గం జగన్‌, ఆర్‌బీఎస్‌ బాధ్యుడు మదన్‌మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్‌రూరల్‌, జూలై 19: పంటల సాగుపై చిన్నకల్వల రైతు వేదిక భవనంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులకు పీఎస్‌బీ జీవ ఎరువులను ఎంపీపీ పొన్ననమేని బాలాజీరావు అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఏరుకొండ రమేశ్‌గౌడ్‌, ఆర్‌బీఎస్‌ బాధ్యుడు పురం ప్రేమ్‌చందర్‌రావు, ఏఈవో రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నూతన విధానాలపై దృష్టి పెట్టండి
నూతన విధానాలపై దృష్టి పెట్టండి
నూతన విధానాలపై దృష్టి పెట్టండి

ట్రెండింగ్‌

Advertisement