e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home కరీంనగర్ సకాలంలో అనుమతులు ఇవ్వాలి

సకాలంలో అనుమతులు ఇవ్వాలి

సకాలంలో అనుమతులు ఇవ్వాలి

పెద్దపల్లి జంక్షన్‌, జూలై 13: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను ప్రభుత్వ నిబంధన ప్రకారం సకాలంలో అందించాలని అదనపు కలెక్టర్‌ వి.లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి, పరిశ్రమలకు అందించే ప్రోత్సాహక అంశాలపై సంబంధిత అధికారులతో జూమ్‌ యాప్‌ (వీడియో కాన్ఫరెన్‌) ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. పరిశ్రమ ప్రోత్సాహాక కమిటీ ద్వారా జిల్లాలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలకు ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి సత్వరమే అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు, ఎగుమతులను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాను ఎగుమతుల హబ్‌గా తీర్చిదిద్దేందుకు గాను సంబంధిత అధికారులతో ప్రత్యేక సబ్‌ కమిటీని ఏర్పాటు చేరన్నారు. పెట్టబడి రాయితీపై 2 ఎస్సీ, 2 ఎస్టీ యూనిట్లు, వడ్డీ రాయితీపై 7 ఎస్సీ యూనిట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ కె.సమ్మయ్య, ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ గంగాధర్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ప్రేమ్‌కుమార్‌, ప్రాంతీయ రవాణా అధికారి రంగారావు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంస్థ అసిస్టెంట్‌ మేనేజర్‌ వికాస్‌, ఐపీవో శ్రీనివాస్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సకాలంలో అనుమతులు ఇవ్వాలి
సకాలంలో అనుమతులు ఇవ్వాలి
సకాలంలో అనుమతులు ఇవ్వాలి

ట్రెండింగ్‌

Advertisement