పెద్దపల్లిటౌన్, జూలై 12: తెలంగాణ టీఎస్టీఎస్ చైర్మన్ చిరుమల్ల రాకేశ్‌కుమార్ జన్మదిన వేడుకలు పెద్దపల్లిలోని అయ్యప్య ఆలయ కూడలిలో కౌన్సిలర్ ఉప్పు స్వరూప, టీఆర్ఎస్ నాయకుడు, న్యాయవాది ఉప్పు రాజు నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఇక్కడ నాయకులు కొమ్ము సుధాకర్, ఉనుకొండ ప్రకాశ్, గాండ్ల మల్లేశం, దేవేందర్, శివకుమార్, గట్టయ్య, నాగరాజు, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్, జూలై 12 : చిరుమల్ల రాకేశ్ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో టీఆర్ఎస్ యూత్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. టీఆర్ఎస్వీ జిల్లా నాయకులు మేడుదుల రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు నూనేటి కుమార్, సభ్యులు కూకట్ల నవీన్, సువర్ణ బిట్టు, బోయిని కుమార్, ధర్ముల రవి, చిలుముల వికాస్, ముస్కు తిరుపతి, బొమ్మ రాజు, వెలుతురు జయరాజ్ పాల్గొన్నారు.
ఓదెల, జూలై 12: నాంసానిపల్లిలో మాజీ వైస్ ఎంపీపీ పోతుగంటి రాజుగౌడ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వీరవేని నాగరాజు, రాపర్తి తిరుపతి, తిరుమని హరీశ్, ధర్ముల సతీశ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.