బుధవారం 01 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 03, 2020 , 01:57:18

పరిశీలిస్తూ.. సూచనలిస్తూ..

పరిశీలిస్తూ.. సూచనలిస్తూ..

గోదావరిఖని, నమస్తే తెలంగాణ : దేశంలోనే తెలంగాణ విద్యార్థులను అగ్రగామిగా నిలుపాలన్నదే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. గోదావరిఖని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో సోమవారం రూ. 50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న కొత్త భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంఖుస్థాపన చేసి అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ జాతి రత్నాలు అయిన విద్యార్థులు భవిష్యత్‌ను బంగారు మాయం చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వం అహర్నిషలు పాటుపడుతోందన్నారు. విద్యార్థులు పట్టుదలతో విద్య అభ్యసించి ఉన్నతంగా ఎదగలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యాభోదన సాగిస్తుందన్నారు. కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్‌ మేయర్‌ డాక్టర్‌ బంగి అనిల్‌కుమార్‌, కమిషనర్‌ ఉదయ్‌ కుమార్‌, కార్పొరేటర్లు కాల్వ స్వరూప, దాతు శ్రీనివాస్‌, ఎన్టీపీసీ సీఎస్‌ఆర్‌ అధికారులు రఫికుల్‌ ఇస్లాం, నాయకులు కాల్వ శ్రీనివాస్‌, చిలుముల విజయ్‌కుమార్‌, గొలుసు నాగరాజు పాల్గొన్నారు. 

అంకితభావంతో మెదలాలి..  

విద్యార్థులు గురువులపై గౌరవ మార్యదలు, అంకిత భావంతో మెదలాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. గోదావరిఖని సప్తగిరికాలనీలోని ఆదివారం రాత్రి ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఫెర్వల్‌ వేడుకలను గోదావరిఖని మార్కండయాకాలనీ బృందావన్‌ గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తల్లి, తండ్రులు, గురువులపై విద్యార్థులు మంచిగా మెదిలినప్పుడే వారు తమ జీవితంలో ఉన్నతంగా ఎదిగే అవకాశముంటుందన్నారు. విద్యార్థులు తమకంటూ ఒక లక్ష్యంతో ముందుకు సాగాలనీ, కృషి, పట్టుదల ఉంటే ఎదైనా సాధించవచ్చునన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ పర్శ రమేశ్‌, నాయకులు అడ్డాల రామస్వామి, కరాటే శిక్షకులు శ్రీనివాస్‌, శ్రావణ్‌కుమార్‌, రోహిత్‌, మోఘన, శిభశ్రీ పాల్గొన్నారు. 


logo
>>>>>>