e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home కరీంనగర్ హక్కులపై అవగాహన పెంచుకోవాలి

హక్కులపై అవగాహన పెంచుకోవాలి

పెద్దపల్లి రూరల్‌, సెప్టెంబర్‌ 17: మానవ హక్కులపై అందరూ అవగాహన పెంచుకోవాలని మండల న్యాయసేవా సంస్థ చైర్మన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్డి వరూధిని పేర్కొన్నారు. మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో గుర్రాంపల్లిలో శుక్రవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. పెద్దపల్లి సీనియర్‌ సివిల్‌ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారిగా గ్రామానికి వచ్చిన జడ్జిని లయన్స్‌ క్లబ్‌ పెద్దపల్లి శాతకర్ణి సభ్యులు, సర్పంచ్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ, గ్రామశివారులోని సాగు భూములకు అన్ని ఆధారాలు ఉన్నా అటవీశాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మాదిరెడ్డి భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ మాదిరెడ్డి తిరుపతి రెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దాసరి వెంకటరమణా రెడ్డి, ప్రధాన కార్యదర్శి లకిడి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి
న్యాయ విజ్ఞాన సదస్సులను క్షకిదారులు సద్వినియోగం చేసుకోవాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి పార్థసారథిరావు సూచించారు. కనుకులలో రైతు భవనంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పోలు అంజయ్య, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఒడ్నాల రవీందర్‌, ప్రధాన కార్యదర్శి నేరెళ్ల శంకర్‌, ఏజీపీ మేకల తిరుపతిరెడ్డి, న్యాయవాదులు సత్యనారాయణ, రమేశ్‌, సర్వోత్తమ్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్‌, తిరుపతి, శివకృష్ణ, గోపినాథ్‌ పాల్గొన్నారు.

- Advertisement -

ఎల్కలపల్లి గేట్‌లో..
ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని గోదావరిఖని ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి పర్వతపు రవి సూచించారు. ఎల్కలపల్లి గేట్‌ కాలనీలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఇక్కడ 1వ, 2వ అదనపు మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌లు పీఎస్‌వీ భార్గవి, జీఎస్‌ఎల్‌ ప్రియాంక, ఎన్టీపీసీ ఎస్‌ఐ స్వరూప్‌ రాజ్‌, కార్పొరేటర్‌ నీల పద్మ గణేశ్‌ ఉన్నారు. అలాగే 13వ డివిజన్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఇక్కడ కార్పొరేటర్‌ రాకం లత దామోదర్‌ తదితరులున్నారు.

పట్టణంలోని స్పేస్‌ శాంతినికేతన్‌లో కరీంనగర్‌ జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆదేశాల మేరకు చిన్నారులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. అథారిటీ సభ్యుడు భూమయ్య హాజరై లీగల్‌ సెల్‌ అథారిటీ ద్వారా ఏ న్యాయం పొందవచ్చునో వివరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు శ్రావణ్‌కుమార్‌, వరలక్ష్మి, పాఠశాల ప్రిన్సిపాల్‌ పాపిరెడ్డి పాల్గొన్నారు.

ఎక్లాస్‌పూర్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి నాగేశ్వర్‌రావు,అడిషనల్‌ జడ్జి శ్రీధర్‌, సీనియర్‌ న్యాయవాది రఘోత్తంరెడ్డి, లోక్‌ అదాలత్‌ సభ్యులు ఆంజనేయులు, సుభాష్‌, కటకం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement