e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home వ్యాసాలు తెలంగాణ.. మిశ్రమ సంస్కృతి

తెలంగాణ.. మిశ్రమ సంస్కృతి

భారత జాతీయ కాంగ్రెస్‌ చేపట్టిన ఉద్యమం తెలంగాణ పౌరసమాజంలో నూతన రాజకీయ చైతన్యాన్ని పెంపొందించింది. 1888వ సంవత్సరంలో సికింద్రాబాద్‌లో ఏర్పాటైన జాతీయ కాంగ్రెస్‌ సభకు దాదాపు 2000 మంది హాజరయ్యారు. హిందువులతో పాటు జాతీయవాదులైన ముస్లింలు, క్రైస్తవులు ఈ సభలో పాల్గొని సంఘీభావాన్ని తెలిపారు. 

మిశ్రమ సంస్కృతికి ప్రతీకగా పేరొందిన తెలంగాణ జాతీయోద్యమంలో విశిష్ట స్థానాన్ని పొందింది. ఆధునిక యుగంలో మతాతీత, సెక్యులర్‌ జాతీయ వాదాన్ని పెంపొందించిన ఘనత కూడా కలిగి ఉంది. 1857లో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన మొదటి స్వాతంత్య్ర సమరం హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనం. మౌల్వీ అలా ్లఉద్దీన్‌ తుర్రెబాజ్‌ఖాన్‌ నాయకత్వంలో హైద్రాబాద్‌లోని బ్రిటిష్‌ రెసిడెన్సీపై దాడి జరిగిన తర్వాత కోయ, గొండ్‌, ఖిల్‌ ఆదివాసీలు, రొమిల్లా ఆఫ్ఘన్‌ సిపాయిలతో పాటు ఉన్నత వర్గాలకు చెందిన హిందూ జమీందార్లు, దేశ్‌పాండేలు, వలసవాద వ్యతిరేక తిరుగుబాట్లలో పాల్గొన్నారు. 

- Advertisement -

ద్రాబాద్‌ సంస్థానంలో బ్రిటిష్‌ వ్యతిరేకత హిందూ ముస్లింల ఐక్యతను పెంపొందించడం ఆంగ్లేయులను కలవరపరిచింది. ‘మన పాలనతో విసుగుచెందిన వర్గాలు సమిష్టిగా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి’ అని ఒక బ్రిటిష్‌ అధికారి పేర్కొన్నారు. అదేవిధంగా బ్రిటిష్‌ అనుకూల వార్తాపత్రిక ఇంగ్లీష్‌మన్‌ ఈ విధంగా రాసింది. ‘హిందువులు మనల్ని అసహ్యించుకుంటారు, ముస్లింలను ప్రేమిస్తారు’. తుర్రెబాజ్‌ఖాన్‌ ప్రారంభించిన వలసవాద వ్యతిరేక ఉద్యమంలో వర్గ, కుల, మతాలకు అతీతంగా బహుజన, అగ్రవర్ణాలు కలసికట్టుగా పాల్గొనడం ఆధునిక తెలంగాణ చరిత్రలో ముఖ్య ఘట్టంగా పేర్కొనవచ్చు.

19వ శతాబ్దం చివరి దశకాల్లో నిజాంలు బ్రిటిష్‌ పాలకుల తొత్తులుగా వ్యవహరించడంతో అసంతృప్తి చెందిన మధ్య తరగతి విద్యావంతులు, మేధావులు, వలసవాద వ్యతిరేక సిద్ధాంతాలను, భావజాలాలను ప్రచారం చేశారు. బ్రిటిష్‌ పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చడానికి నిజాం ప్రభుత్వం ప్రవేశపెట్టిన చాందా రైల్వే స్కీంను నిజాం కాలేజీ ప్రిన్సిపాల్‌ అఘోరనాథ్‌ ఛటోపాధ్యాయ, నిజాం ప్రభుత్వ అధికారులైన ముల్లా అబ్దుల్‌ ఖయ్యూం. దస్తూరిజా సగీలు వ్యతిరేకించి ఉద్యమాన్ని చేపట్టారు. 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపన తర్వాత, తొలి నాటి జాతీయ ఉద్యమంలో విశాల ప్రాతిపదికపై హిందూ ముస్లిం మేధావులు పాల్గొన్నారు. అఘోరనాథ్‌ ఛటోపాధ్యాయ, అబ్దుల్‌ ఖయ్యూం హాజీ సజన్‌లాల్‌, రామచంద్ర పిళ్ళై, రామాజన్‌ మొదలియార్‌, రాజా మురళీమనోహర్‌ లాంటి ప్రముఖులు భారత జాతీయ కాంగ్రెస్‌లో సభ్యులుగా చేరారు. జాతీయతా భావాలను ప్రచారం చేయడంలో షేకతుల్‌ షాకతుల్‌ ఇస్లాం, హైద్రాబాద్‌ లాంటి వార్తా పత్రికలు ముఖ్య పాత్ర వహించినాయి. మోహిబ్‌ హుసేన్‌, సయ్యద్‌ అఖీల్‌ లాంటి కొంతమంది పత్రికా సంపాదకులు కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలను సమర్థించారు. ముల్లా అబ్దుల్‌ ఖయ్యూం నిజాం ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ సఫైర్‌ దక్కన్‌ పత్రికలో జాతీయ కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యాసాలు రాశాడు. హైద్రాబాద్‌ రికార్డ్‌ పత్రిక నిజాం ప్రభుత్వ ఆంక్షలను నిరసిస్తూ బ్రిటిష్‌ రెసిడెంట్‌ చర్యలను ఖండించి ఆయనను ‘స్థానిక కైజర్‌గా’ వర్ణించింది.

భారత జాతీయ కాంగ్రెస్‌ చేపట్టిన ఉద్యమం తెలంగాణ పౌర సమాజంలో నూతన రాజకీయ చైతన్యాన్ని పెంపొందించింది. 1888వ సంవత్సరంలో సికింద్రాబాద్‌లో ఏర్పాటైన జాతీయ కాంగ్రెస్‌ సభకు దాదాపు 2000 మంది హాజరయ్యారు. హిందువులతో పాటు జాతీయవాదులైన ముస్లింలు, క్రైస్తవులు ఈ సభలో పాల్గొని సంఘీభావాన్ని తెలిపారు. బ్రిటిష్‌ ఇండియాలో చెలరేగిన వందేమాతరం, ఖిలాఫత్‌, సహాయ నిరాకరణ ఉద్యమాలతో ప్రభావితులైన మేధావులు కేశవరావు కోరాట్కర్‌, వామన్‌నాయక్‌లు 1918లో కాంగ్రెస్‌ కమిటీని ఏర్పాటుచేసి జాతీయ ఉద్యమాన్ని నడిపించారు. 

మహాత్మాగాంధీ నాయకత్వంలో ప్రారంభమైన ఖిలాఫత్‌, సహాయ నిరాకరణ ఉద్యమాలకు హైద్రాబాద్‌ నగరంతో సహా తెలంగాణ ప్రాంతం నుంచి ఆదరణ లభించింది. కరీంనగర్‌, జనగాం, మెదక్‌, గుల్బర్గా, రాయచూర్‌, ఔరంగాబాద్‌ జిల్లాల్లో ఖిలాఫత్‌ ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. ఈ ఉద్యమంలో బారిష్టర్‌ అస్గర్‌ హసన్‌, హుమాయీన్‌ మిర్జా, కోరాట్కర్‌, రామన్‌ నాయక్‌, మందముల నర్సింగ్‌రావు లాంటి ప్రముఖ నాయకులు పాల్గొనడంతో హిందూ ముస్లిం సఖ్యత ప్రదర్శించబడింది. ఖిలాఫత్‌ డే సందర్భంగా హైద్రాబాద్‌ నగరంలో వివేకవర్దిని మైదానంలో 1920 ఏప్రిల్‌ 23న జరిగిన గొప్ప బహిరంగసభలో వేల సం ఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఖిలాఫత్‌ ఉద్యమ ప్రభావాన్ని గమనించిన బ్రిటిష్‌ రెసిడెంట్‌ నిజాం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాజకీయ ఉద్యమాలను అణిచివేయించాడు. అదేవిధంగా గాంధీజీ భావాలు, ఆలోచనలతో ప్రభావితులైన హిందూ ముస్లిం యువకులు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. పుణా, బొంబాయి, అలీగఢ్‌ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న అనేక మంది హైదరాబాదీ విద్యార్థులు తమ చదువులకు స్వస్తి చెప్పి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. వారిలో సరోజినీనాయుడు కుమారుడు జయసూర్య, అక్బర్‌ అలీఖాన్‌, మీర్‌ మహ్మద్‌ హుసేన్‌, మహ్మద్‌ అన్సారీ లాంటి వారు ముఖ్యులు. రాజకీయ చైతన్యంతో తీవ్ర ప్రభావితులై జాతీయ ఉద్యమంలో పాల్గొన్న పలువురు ముస్లిం ప్రముఖులు పైజామాలకు బదులు ఖాదీ దోతీలు, గాంధీ టోపీలు ధరించి జాతీయాభిమానాన్ని చాటుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు బద్రుల్‌ హసన్‌, జాఫర్‌ హసన్‌లు బారిష్టర్‌ శ్రీ కిషన్‌, పద్మజా నాయుడు లాంటివారు ఖాదీ ఉద్యమాన్ని వ్యాప్తిచేశారు. గాంధీయిజం ప్రభావం తెలంగాణ ప్రాంతంలో చెలరేగిన సామాజిక, రాజకీయ ఉద్యమాలపై ప్రస్ఫుటంగా ఉందని చెప్పటానికి ఖిలాఫత్‌, సహాయ నిరాకరణ, ఖాదీ ఉద్యమాలు చక్కటి నిదర్శనం.

మహాత్మాగాంధీ నాయకత్వంలో ప్రారంభమైన ఖిలాఫత్‌, సహాయ నిరాకరణ ఉద్యమాలకు హైద్రాబాద్‌ నగరంతో సహా తెలంగాణ ప్రాంతం నుంచి ఆదరణ లభించింది. కరీంనగర్‌, జనగాం, మెదక్‌, గుల్బర్గా,రాయచూర్‌, ఔరంగాబాద్‌ జిల్లాల్లో ఖిలాఫత్‌ ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. ఈ ఉద్యమంలోబారిష్టర్‌ అస్గర్‌ హసన్‌, హుమాయీన్‌ మిర్జా, కోరాట్కర్‌, రామన్‌ నాయక్‌, మందముల నర్సింగ్‌రావు లాంటి ప్రముఖ నాయకులు పాల్గొనడంతో హిందూ ముస్లిం సఖ్యత ప్రదర్శించబడింది. 

అడపా సత్యనారాయణ

(వ్యాసకర్త: విశ్రాంత ఆచార్యుడు, ఉస్మానియా యూనివర్సిటీ)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement