e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home ఎడిట్‌ పేజీ బహు రచనలశాల.. చెరసాల

బహు రచనలశాల.. చెరసాల

బహు రచనలశాల.. చెరసాల

వరంగల్లు మట్టెవాడలో మేమందరం పుట్టి పెరిగిన మా ఇంటికి (ఇప్పుడు మా ఇల్లు కాదు) చాలా దగ్గరలో బహుశా ఓ కోసెడు లేక కూత దూరంలో ఉంది వరంగల్లు జైలు. వరంగల్‌ పోరుగల్‌ నుంచి హనుమకొండ (హనుమద్గిరి) వెళ్తుంటే ఎడమ వైపున రోడ్డుకు కాకతీయుల కాలం నాటి భద్రకాళి దేవాలయం ఉన్నది. దేవాలయం పక్కనే పెద్ద చెరువు ఉన్నది. రోడ్డుకు కుడివైపున జైలు ఉంది.

జైలు చుట్టూ ఎంతో చరిత్ర. దేశ స్వాతంత్య్రం కోసం ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని గర్జించిన లోక్‌మాన్య బాల గంగాధర తిలక్‌ ఎనిమిదేండ్లు గాంధీజీ తొమ్మిదేండ్లు, జవహర్‌ లాల్‌ నెహ్రూ పదకొండేండ్లు జైలుశిక్ష అనుభవించారు. జవహర్లాల్‌ నెహ్రూ మూడు ఉద్గ్రంథాలను జైళ్లలోనే రచించారు. మరికొందరు నాయకులు జైళ్లలో గ్రంథాలు రాశారు.

వరంగల్లు జైలు నాకు కొత్త కాదు. అంటే, నేను జైల్లో ఉన్నానని కాదు. ఎన్నడూ జైలుకు వెళ్లలేదు. అందులో ఉండలేదు. అందులో నిర్బం ధం అనుభవిస్తున్న మిత్రులను, బంధువులను, సన్నిహితులను చూసి, కొన్ని మాటలు (శుష్కప్రియాలు) మాట్లాడటానికి వరంగల్లు జైలుకు ఎన్నోసార్లు వెళ్లాను. హనుమకొండ వెళ్తూ, అక్కడినుంచి వస్తూ జైలు వైపు చూడక తప్పదు. అందులో ఉన్నవాళ్లు ఖైదీలు; బయట ఉన్నవాళ్లం స్వేచ్ఛాజీవులం. ఇద్దరి మధ్య ఎంతో తేడా హస్తిమశక అంతరం! జైలు నిర్బంధంలో నలుగుతున్న వారిలో కొందరు ఇతరుల హక్కులు, స్వేచ్ఛ కోసం తమ హక్కు లు, స్వేచ్ఛను కోల్పోయారు. జైలు అనగానే చరిత్ర కళ్లముందు తిరుగుతున్నది. జైలు చుట్టూ ఎంతో చరిత్ర. దేశ స్వాతంత్య్రం కోసం ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని గర్జించిన లోక్‌మాన్య బాల గంగాధర తిలక్‌ ఎనిమిదేండ్లు (బర్మాలోని మాండలే జైలులో ఆరేండ్లు), గాంధీజీ తొమ్మిదేండ్లు, జవహర్లాల్‌ నెహ్రూ పదకొండేండ్లు జైలుశిక్ష అనుభవించారు. జవహర్లాల్‌ నెహ్రూ మూడు ఉద్గ్రంథాలను జైళ్లలోనే రచించారు. మరికొందరు నాయకులు జైళ్లలో గ్రంథాలు రాశారు. 1975 జూన్‌ 25 నుంచి అంతర్గత ఎమెర్జన్సీలో జైల్లో ఉన్న లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ అనారోగ్యంతోనే జైలులో డైరీ రచించారు.

వరంగల్‌ జైలు ఇప్పటిది కాదు. 6వ నిజావ్‌ు రాజు మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ (1869-1911) జమానా లో, 1886లో వరంగల్‌ జైలు 54 ఎకరాలలో స్థాపితమైంది. ‘పూవు పుట్టగానే పరిమళించినట్లు’ అని అంటా రు. ఒకవంక సింహాసనం కోసం వివాదం చెలరేగుతున్నప్పటికి, మరోవంక బ్రిటిష్‌ రెసిడెంట్‌ తన పెత్తనం కోసం పేచీ పెట్టుతున్నప్పటికి సాలార్‌జంగ్‌ (తర్వాత ఆయనే ప్రధానమంత్రి) సహాయంతో రెండేండ్ల ఏడు నెలల పసిబిడ్డ మహబూబ్‌ అలీఖాన్‌ పట్టాభిషిక్తుడైనాడు ఆరవ నిజావ్‌ు రాజుగా. అసఫ్‌జాహీ ప్రభువైన మహబూబ్‌ అలీఖాన్‌ ప్రజలందరి మనిషి. ప్రజలంతా మతాలకు అతీతంగా ఆయనను ప్రేమించారు. ఆయన ప్రజలను ప్రేమించాడు. ఆ ప్రభువు 1893లో హైదరాబాద్‌ సంస్థానంలో ప్రజాప్రతినిధుల శాసనమండలిని స్థాపించాడు.1901 నుంచి హిందూ ప్రముఖుడు మహరాజా కిషన్‌ ప్రసాద్‌ ప్రధానమంత్రి. 1908లో మూసీ వరదలతో వేలమంది నిరాశ్రయులైనప్పుడు మహబూబ్‌ అలీఖాన్‌ హారతి పట్టి మూసీలో హిందూ పూజలు చేయడం విశేషం. మహబూబ్‌ అలీఖాన్‌ ముస్లింల కోసమే కాకుండా హిందువుల కోసం కూడా వారి పండుగల సమయాన దర్బారులు ఏర్పాటుచేసేవాడు. అసఫ్‌జాహీ వ్యవస్థలో మత సామరస్యం వెల్లివిరిసి ఒక మిశ్రమ సంస్కృతి రూపుదాల్చిందనడంలో సందేహం లేదు.

అమూల్య ఆభరణాలు ఎన్ని ఉన్నప్పటికి ఢిల్లీలో వైస్రాయి ఏర్పాటుచేసిన ఒక అధికార ఉత్సవానికి ఆభరణాలు ఏవీ లేకుండా వెళ్లి వైస్రాయి లార్డ్‌ కర్జన్‌ను ఆశ్చర్యపరిచిన అతి నిరాడంబరుడు ఆరవ అసఫ్‌జాహీ రాజు మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌. నిరంకుశ పాలనకు, రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యం కోసం, భూమి భుక్తి కోరుతూ పోరాడిన వేలమంది స్వాతంత్య్రయోధులు వరంగల్‌ జైలులో నిర్బంధం అనుభవించారు. ప్రజాకవులు కాళోజీ, దాశరథి, ఇంకెందరో కవులు, రచయితలు, మేధావులు ఈ వరంగల్‌ జైలులో నిర్బంధం అనుభవించారు. భారత స్వాతంత్య్రం తర్వాత నెల రోజులకు 1947 సెప్టెంబర్‌లో నిజాం ప్రభుత్వం దాశరథిని అరెస్టు చేసి వరంగల్‌ జైలులో నిర్బంధించింది. తర్వాత 1947 డిసెంబర్‌లో ఓరోజు నడిరాత్రి చలిలో దాశరథిని నిజామాబాద్‌ జైలుకు తరలించారు. ఆ నడిరాత్రి చలిలో దాశరథి బిల్హణుని ఇరువై శ్లోకాలను తెలుగులోకి అనువదించారు.. ధర్మసంస్థాపన కోసం శ్రీకృష్ణ భగవానుడు కారాగారంలో అవతారమెత్తినట్లు.

ఏడేండ్ల కిందట తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభు త్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమిత విజ్ఞతతో, దూరదృష్టితో బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా వరంగల్లు పట్టణ సర్వతోముఖ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వరంగల్లు జైలు స్థానం లో, బహుముఖంగా విస్తరిస్తున్న వరంగల్లు పట్టణం నడిబొడ్డున (వరంగల్లు నగరం నడి బొడ్డున జైలు స్థానంలో ఒక బహుళార్థ సాధక ఆస్పత్రి అత్యవసరం, సమంజసం. ఈ ఆసుపత్రి స్థాపనను వరంగల్లు ప్రజలే కాదు, చుట్టుప్రక్కల అనేక ప్రాంతాల ప్రజలు కొన్ని తరాల వరకు జ్ఞాపకం పెట్టుకునే మేలుగా భావిస్తారు) ఒక బహుళార్థ సాధక ఆస్పత్రిని నిర్మించాలన్న కేసీఆర్‌ ఆలోచన అద్భుతమైనది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అద్భుతమైన ఆలోచనల ఆటపట్టని గత ఏడు సంవత్సరాలలో ఎవరికీ సందేహం లేకుండా రుజువయింది. కేసీఆర్‌ కార్యదక్షత, నాయకత్వ పటిమ ఈ ఆలోచన కార్యరూపం దాల్చడానికి దోహదపడుతాయి.

బహు రచనలశాల.. చెరసాలదేవులపల్లి ప్రభాకరరావు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బహు రచనలశాల.. చెరసాల

ట్రెండింగ్‌

Advertisement