క్షణం చిత్తం-క్షణం విత్తం
క్షణం జీవితమావయోః
యమస్య కరుణానాస్తి
ధర్మస్య త్వరితా గతిః॥
మనసు క్షణంలో మరుతుంది. ధనం క్షణంలో పోతుంది. జీవితం కూడా క్షణంలో ముగిసిపోవచ్చు. మృత్యువు (యముడి)కి దయ, జాలి ఏవీ ఉండవు. తీసుకెళ్లాల్సిన సమయంలో కచ్చితంగా తీసుకువెళ్తాడు. కాలం చాలా వేగంగా పరుగెడుతుంది. అందుకే వీలైనంత కాలం ధర్మకార్యాలని చెయ్యాలనిపించిన వెంటనే చేసే ద్దాం. రేపనేది ఉంటుందో ఉండదో? ఊపిరి ఉన్నంత సేపు మంచికోసం తపనపడి, మంచిపనులే చేస్తే సమాజానికి ఎంతో మేలు. అదే జీవితానికి అర్థం, పరమార్థం.
టి.సుధాకరశర్మ