e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home ఎడిట్‌ పేజీ జెండా పండుగ

జెండా పండుగ

జెండా పండుగ
ఎగిరింది గుండెల నిండుగా
నాలుగున్నర కోట్ల ప్రజల అండదండగా
సకలజనుల సమ్మేళనంతో
నడిబొడ్డున నాటుకుంది తెలంగాణ జెండా
నిరుపేదల వెలుగుల జెండా పండగ
వీరయోధుల నెత్తుటి జెండా పండగ
త్యాగమూర్తుల పుణ్యఫలం
జెండా పండుగ
అమరవీరుల కలల స్వప్నం
ఆకలిజీవుల ఊపిరి గానం
బడుగుజీవుల శ్వాస నినాదం
కోటికాంతుల తరగని తరంగం
పొడిసే పొద్ద్దోలే అగ్ని కిరణం
పల్లెపల్లెన ప్రజా సంక్షేమం
వేల సంఖ్యలో వెన్నెలై ఎగిరింది
కోటి గుండెల్లో సందడైంది
పేదోల్ల జాతి పెన్నిధి అయింది
కన్న పేగుబంధమై సాగింది
తెలంగాణ నుదుటి సింధూరం
తెలంగాణ కేసీఆర్‌ గిఫ్ట్‌ తిలకం
తెలంగాణ జెండా పండుగ..!!
సంబురాలు అంబరాన్నంటే దండిగా..!!


బాలు కత్తుల
96762 19655

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement