సాధారణంగా శృంగారం విషయంలో పురుషులు ఎక్కువగా చొరవతీసుకుంటారు. స్త్రీలు సిగ్గుపడుతూ బిడియంగా ఉంటారు. కానీ, మనసైన వాడితో మనస్ఫూర్తిగా శృంగారంలో పాల్గొంటున్న సమయంలో మాత్రం పురుషుడిలో ప్రతి కదలికను స్త్రీలు నిశితంగా గమనిస్తుంటారట. ఎంతలా అంటే మేల్ పార్ట్నర్ ఏకంగా స్కానింగే చేసేస్తారట. శృంగారానికి ముందు ఆ విషయం గురించి మాట్లాడితేనే సిగ్గుపడిపోయే మగువలు.. మరి తీరా ముగ్గులోకి తిరిగిన తర్వాత పురుషుల్లో అంత నిశితంగా గమనించే అంశాలు ఏమిటో తెలుసుకుందామా..?
స్త్రీలు శృంగారం విషయంలో చొరవ తీసుకోవడానికి మొహమాటపడినా పురుషుడు చొరవ తీసుకున్న తర్వాత మాత్రం యాక్టివ్గా మారిపోతారట. తమ మేల్ పార్ట్నర్ను అణువణువూ క్షుణ్ణంగా స్కాన్ చేస్తారట. ఆ సమయంలో స్త్రీ పురుషుడి కదలికలను గమనించినంత వేగంగా.. పురుషుడు స్త్రీ కదలికలను గమనించలేడట. ఓ సర్వే సంస్థ గతంలో నిర్వహించిన సర్వేలో తేలిన విషయం ఏమిటంటే.. పురుషులతో పోలిస్తే సాధారణంగా మహిళల్లో పరిశీలనా శక్తి ఎక్కువగా ఉంటుందట. ఆ పరిశీలనా శక్తి వారికి అన్ని విషయాలతోపాటు శృంగారం విషయంలో తోడ్పడుతుందట.
స్త్రీ తన పరిశీలనాశక్తిని ఉపయోగించి ఆ సమయంలో భర్తను బాగా గమనిస్తుందట. భర్త ఆకృతి, కండలు, ముఖాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుందట. కళ్లు మూసుకుని కూడా అతని రూపాన్ని ఆస్వాదిస్తుందట. శృంగారం వేళ పురుషుల్లో స్త్రీలు గమనించే మరో అంశం శ్వాస. పురుషుడు ఎంత దమ్ముగొని శ్వాస తీసుకుంటే స్త్రీ అంత తృప్తి చెందుతుందట. పురుషుడితో స్త్రీ గమనించే మరో అంశం నాలుక. పురుషుడు తన నాలుకతో ఒక్కో భాగాన్ని స్పృశిస్తుంటే చూసి స్త్రీ మధురానుభూతి చెందుతుందట.
పురుషుల్లో స్త్రీలు గమనించే మరో ముఖ్యమైన అంశం ధ్వని. సాధారణంగా శృంగారం వేళ స్త్రీ, పురుషులు మూలుగుతూ సన్నని శబ్దాలు చేస్తారు. పురుషులు చేసే ఆ శబ్దాలను స్త్రీలు శ్రద్ధగా వింటూ తీయని అనుభూతి చెందుతారట. పురుషుడి చేతివేళ్లను కూడా స్త్రీలు బాగా గమనిస్తారట. అతడు తన చేతివేళ్లతో ఒంటిపై ఎక్కడెక్కడ టచ్ చేస్తున్నాడో నిశితంగా గమనిస్తారట. స్త్రీలు పురుషుల నుంచి గ్రహించే మరో అంశం వాసన. శృంగారం వేళ పురుషుల నుంచి వాసనలను స్త్రీలు ఆస్వాదిస్తారట.