e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News Mother's Day : అమ్మ కోసం నెద‌ర్లాండ్‌లో ఇద్ద‌రు భార‌తీయ‌ యువ‌తుల పోరాటం

Mother’s Day : అమ్మ కోసం నెద‌ర్లాండ్‌లో ఇద్ద‌రు భార‌తీయ‌ యువ‌తుల పోరాటం

Mother's Day : అమ్మ కోసం నెద‌ర్లాండ్‌లో ఇద్ద‌రు భార‌తీయ‌ యువ‌తుల పోరాటం

నిద్ర‌లోనూ అమ్మను పొదివి పట్టుకుంటుంది బిడ్డ. ఏ జాతరకో వెళ్లినప్పుడు అయితే, తల్లి చెయ్యి విడిచిపెడితే ఒట్టే! అలాంటిది, కన్నతల్లి శాశ్వతంగా కనిపించకపోతే.. ఆ బిడ్డ ఆరాటం ఎలా ఉంటుంది? అమ్మ కోసం.. నెలల పసికందులుగా ఉన్నప్పుడే దత్తత పేరుతో నెదర్లాండ్స్‌కు వెళ్లిపోయిన ఇద్దరు యువతుల అన్వేషణ ఇది.

జ్యోతి..

రెజీనా..

పేర్లు వేరు. కానీ, ఒకే రకమైన జీవితాలు. ఇద్దరికీ అమ్మంటే తెలియదు. పాతికేండ్ల కితం భారత్‌నుంచి నెదర్లాండ్స్‌కు దత్తత వెళ్లారు. మొదట్లో చుట్టూ ఉన్న తెల్ల మనుషుల్ని చూసి తెల్లబోయేవారు. అమ్మ తెలుపు. నాన్న తెలుపు. పొరుగింటి వారు తెలుపు. బడిలో పిల్లలంతా తెలుపు. మేం మాత్రం చామనఛాయగా ఉన్నామెందుకు?’ ఈ పశ్న ఎవరిని అడగాలి. మనసులోనే దాచుకున్నారు. తమను తామే పశ్నించుకున్నారు. వయసుతోపాటు ఆలోచన పెరిగింది. ఈ నేల తమది కాదనీ, ఈ తల్లి కన్నతల్లి కాదనీ స్పష్టంగా అర్థమైంది.

అమ్మ ఎక్కడ?

మా అమ్మ ఎక్కడ’ – పెంచినవారిని అడిగారు. వాళ్లేం మాట్లాడలేదు. మౌనంగా కొన్ని కాగితాలు చేతిలో పెట్టారు. అవి అడాప్షన్‌ పేపర్స్‌! తమను భారతదేశం నుంచి తీసుకొచ్చారు. ఆ సమయానికి ఇద్దరూ నెలల పసికందులే!

ఏ తల్లీ తన బిడ్డలను వదులుకోదు. పాపం! మా అమ్మకు ఎంత కష్టం వచ్చిందో! ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో. ఆ కథంతా అమ్మను అడగాలి. అసలు, తనెలా ఉందో!

ఒక్కసారి.. ఒక్కసారి చూడాలి, మాట్లాడాలి. ఆలింగనం చేసుకోవాలి. ముద్దుపెట్టుకోవాలి. అంతే, అంతకు మించి ఎలాంటి కోరికా లేదు’ అంటున్నప్పుడు ఇద్దరి కండ్లలోంచి జలజలా నీరు!

Mother's Day : అమ్మ కోసం నెద‌ర్లాండ్‌లో ఇద్ద‌రు భార‌తీయ‌ యువ‌తుల పోరాటం

నెదర్లాండ్స్‌లో తమలాంటి వారే చాలామంది ఉన్నారని వారికి అర్థమైంది. అందరినీ కూడగట్టి ఓ సంఘాన్ని ప్రారంభించారు. ప్ర‌తి మనిషికీ మూలాలు అమూల్యమైనవి. ఆ మూలాలకు మూలం అమ్మే కదా! అమ్మ ఎవరో తెలిస్తేనే మేమెవరమో తెలిసేది!’ అంటుంది జ్యోతి. తల్లిని వెతికే ప్ర‌యత్నంలో ఇద్దరూ చాలాసార్లు భారతదేశానికి వచ్చారు. అనాథాశ్ర‌మాల చుట్టూ, చర్చిల చుట్టూ తిరిగారు. ఏ చిన్న ఆధారమైన దొరక్కపోతుందా అన్న ఆశ.

బుద్ధి తెలిసినప్పటినుంచీ ప్ర‌తి కలలోనూ అమ్మే. తమను వెతుక్కుంటూ వస్తున్నట్టు, వేలు పట్టుకుని వెనక్కి తీసుకెళ్తున్నట్టు. కల కలే అని తెలుసు. కానీ, మనసులో ఏ మూలనో నిజమైతే బావుండన్న ఆశ. అంతలోనే ఒక పీడకల. దత్తతలన్నీ నిజమైన దత్తతలు కావని, పిల్లలను ఎత్తుకొచ్చే ఓ ముఠా కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా చిన్నారులను అమ్ముకొన్నదనీ తెలిసింది. హాయిగా అమ్మ ఒడిలో అందంగా సాగి పోవాల్సిన బాల్యాన్ని గద్దల్లా తన్నుకొచ్చిన ఆ దుర్మార్గుల పట్ల చెప్పరానంత కోపం వచ్చేది. బిడ్డను దూరం చేసుకున్న తల్లులు గుర్తుకొచ్చి గుండె చెరుపోయింది.

నేనెవరో చెప్పండి ప్లీజ్‌?’..

Mother's Day : అమ్మ కోసం నెద‌ర్లాండ్‌లో ఇద్ద‌రు భార‌తీయ‌ యువ‌తుల పోరాటం
రెజీనా

అమ్మను కనిపెట్టండి ప్లీజ్‌?’ నెదర్లాండ్స్‌ న్యాయస్థానాలకూ, భారత పభుత్వానికి ఆ ఇద్దరి విజ్ఞప్తి ఇది. త్వరలోనే, న్యాయపోరాటమూ ప్రారంభించాలని అనుకుంటున్నారు. అడాప్షన్‌ పేపర్లలోని బిహార్‌ రాష్ట్రం బెతియా ప్రాంతంలో ఓ చర్చి మెట్లమీద దొరికింది’ అన్న ఏకవాక్య స్టేట్‌మెంట్‌ ఆధారంగా జ్యోతి తన తల్లిని వెతికే ప్ర‌యత్నం మొదలుపెట్టింది. ఆ సమయానికి ఫాదర్‌గా ఉన్న వ్యక్తిని కలిసింది. నిన్ను ఎవరో దేవుడికి కానుకగా ఇచ్చి వెళ్లారు. నువ్వు దేవుడి బిడ్డవి. కన్నతల్లితో నీకేం పని?’ అంటూ బైబిల్‌ పాఠాలు ప్రారంభించారాయన. రెజీనా అయితే ఓ దశలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. నన్ను దత్తత తీసుకున్న వాళ్లు చాలా మంచివాళ్లు. బాగా చదివించారు. కానీ, నా అమ్మ ఎవరు? అన్న ప్ర‌శ్నే నన్ను స్థిమితంగా ఉండనీయడం లేదు’ అంటున్నదామె.

మిల్క్‌ బాక్స్ ప్రాజెక్ట్‌

Mother's Day : అమ్మ కోసం నెద‌ర్లాండ్‌లో ఇద్ద‌రు భార‌తీయ‌ యువ‌తుల పోరాటం
జ్యోతి

పాశ్చాత్యదేశాల్లో కనిపించకుండా పోయిన పిల్లల ప్ర‌కటనలను మిల్క్‌ బాక్స్‌లమీద ప్ర‌చురించడం సంప్ర‌దాయం. అందుకే, తమ ఉద్యమానికి కూడా మిల్క్‌ బాక్స్ ప్రాజెక్ట్‌’ అనే పేరు పెట్టారు జ్యోతి, రెజీనా. దత్తత పేరుతో కన్నవారికి దూరమైన పిల్లలనూ, భారత్‌లోని తల్లిదండులనూ కలపడమే ఆ ఇద్దరి లక్ష్యం ఇప్పుడు. అలా అని మేం ఇక్కడేవో కష్టాలు అనుభవిస్తున్నామని కాదు. ఎన్నున్నా, అమ్మ లేకపోతే ఆ జీవితం వెలితే..’ అని చెబుతుంది జ్యోతి ఆవేదనగా. ఇప్పటికే రెండుసార్లు భారతదేశానికి వచ్చారిద్దరూ. అవసరమైతే, వందసార్లు వస్తాం. ఎక్కడో ఓ చోట ఆధారం దొరుకుతుంది. ఏదో ఓ మూల మా అమ్మ కనిపిస్తుంది అంటున్నప్పుడు ఇద్దరిలోనూ అనంత ఆత్మవిశ్వాసం. ఆ ఆరాటాన్ని నెదర్లాండ్స్‌ పభుత్వం ఎంతో కొంత అర్థం చేసుకున్నట్టే కనిపిస్తున్నది. ఈమధ్యే అంతర్జాతీయ దత్తతల మీద నిషేధం విధించింది. అమ్మలకోసం బిడ్డల పోరాటానికి ఇది తొలి విజయం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చూడండి..

Mother’s day special: అమ్మ కోసం ఐదు బహుమతులు

Mother’s Day Special : అమ్మ కడుపు చల్లగా

coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి

Coronavirus Recovery: క‌రోనా త‌గ్గినా నీర‌సంగా ఉంటుందా? ఈ జాగ్ర‌త్త‌లు అవ‌స‌ర‌మే

Double Mask అవ‌స‌ర‌మా? స‌ర్జిక‌ల్‌, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?

Coronavirus Doubts : నీటి ద్వారా క‌రోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్‌-19 వ‌స్తుందా?

Oxygen : క‌రోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజ‌న్ పొందండి

ఒక్క మాస్క్ స‌రిపోదా? రెండు మాస్కులు క‌చ్చితంగా వాడాలా?

Covid-19 deaths : క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లొచ్చా? లేదా?

Vaccine Doubts : క‌రోనా వ్యాక్సిన్ రెండు డోసులు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిందేనా? ఒక్క డోస్ స‌రిపోదా?

Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న త‌ర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?

బోర్లా ప‌డుకుంటే ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ పెరుగుతాయా.. ఆ వైర‌ల్ వీడియోలో నిజ‌మెంత‌?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
Mother's Day : అమ్మ కోసం నెద‌ర్లాండ్‌లో ఇద్ద‌రు భార‌తీయ‌ యువ‌తుల పోరాటం

ట్రెండింగ్‌

Advertisement