కుండ బిర్యానీ తరహాలో గుజరాత్‌లోని సూరత్‌లో ఇప్పుడు కుండ పిజ్జా నోరూరిస్తోంది. కుల్హాద్ పిజ్జా పేరుతో సూరత్‌లోని ఓ దుకాణం అందిస్తున్న ఈ డిష్ హాట్ రెసిపీగా మారింది. దీనికి సంబంధించి ఆంచి ముంబై అనే యూట్యూబ్ పేజ్‌లో పోస్ట్ అయిన వీడియో తెగ వైరలవుతోంది. ఈ ఏడాది మార్చిలో ఈ వీడియోను పోస్ట్ చేయగా 23 లక్షల వ్యూస్‌ను రాబట్టింది.
ఈ పిజ్జాను తయారు చేసేందుకు ముందుగా మిక్చర్‌ను తయారు చేశారు. బౌల్లో కార్న్, తరిగిన టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, చాట్మసాలాను మిక్స్ చేశారు. ఆపై కుండలో మిక్చర్‌ను నింపి దానిపై సాస్, వెన్న వేశాడు. దానిలో మొజరెల్లా చీజ్, మరికొంత మిక్చర్, లిక్విడ్ చీజ్‌ను యాడ్ చేసి పిజ్జా తయారు చేసేందుకు ఆ కుండను మైక్రోవేవ్‌లో ఉంచాడు.ఆ వీడియోపై మీరూ లుక్కేయండి..