e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News క్రేజీ తాత : 28 మంది భార్యల ఎదుటే 37వ సారి పెండ్లి ముచ్చ‌ట తీర్చుకున్నాడు!

క్రేజీ తాత : 28 మంది భార్యల ఎదుటే 37వ సారి పెండ్లి ముచ్చ‌ట తీర్చుకున్నాడు!

క్రేజీ తాత : 28 మంది భార్యల ఎదుటే 37వ సారి పెండ్లి ముచ్చ‌ట తీర్చుకున్నాడు!

ఆ తాత‌కు ఇప్ప‌టికే 28 మంది భార్య‌లు, 35 మంది సంతానం..ఏకంగా 126 మంది మ‌న‌వ‌లు, మ‌న‌వ‌రాళ్లు ఉన్నారు. అయితేనేం మ‌రో పెండ్లికి సిద్ధ‌మై భార్య‌ల ఎదుటే ఆ ముచ్చ‌ట తీర్చుకున్నాడు. అప్ప‌డెప్పుడో రాజులు డ‌జ‌న్ల కొద్దీ రాణుల‌ను అంత‌పురంలో కొలువుతీర్చే వార‌ని విన్నాం.కానీ ఇత‌గాడు ఇంత‌మంది భార్య‌లున్నా 37వ భార్య‌తో ప్ర‌స్తుత భార్య‌ల ముందే ఏడ‌డుగులు న‌డిచాడు.ఐపీఎస్ అధికారి రూపిన్ శ‌ర్మ ట్విట్ట‌ర్ లో 45 సెకండ్ల నిడివిగ‌ల ఈ వీడియోను పోస్ట్ చేయ‌గా సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది.

ఈ వీడియోకు రూపిన్ శ‌ర్మ‌..జీవించి ఉన్న అత్యంత సాహ‌సి..28 మంది భార్య‌ల ఎదుట 37వ వివాహం అనే క్యాప్ష‌న్ ఇచ్చాడు. వీడియోను ఎక్క‌డ‌, ఎప్పుడు చిత్రీక‌రించార‌నే వివ‌రాలు తెలియ‌రాలేదు. ఇక తాత గారి భార్య‌ల బాగోతం చూసి నెటిజ‌న్లు త‌లో రకంగా కామెంట్లు చేశారు. ఒక్క పెండ్లే గ‌గ‌న‌మ‌వుతున్న రోజుల్లో అంత‌మంది భార్య‌ల‌తో ఆయ‌న ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడ‌ని ఓ యూజ‌ర్ వ్యాఖ్యానించ‌గా, ఒక్క‌సారి కూడా పెండ్లి కాకుంటే ఆయ‌న 37వ భార్య‌ను క‌ట్టుకోవ‌డం సూప‌రని మ‌రో యూజ‌ర్ కామెంట్ చేశాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క్రేజీ తాత : 28 మంది భార్యల ఎదుటే 37వ సారి పెండ్లి ముచ్చ‌ట తీర్చుకున్నాడు!

ట్రెండింగ్‌

Advertisement