e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 8, 2021
Home News బాస్ వేధింపులు : చీపురుతో దుమ్ముదులిపిన మ‌హిళ

బాస్ వేధింపులు : చీపురుతో దుమ్ముదులిపిన మ‌హిళ

బాస్ వేధింపులు : చీపురుతో దుమ్ముదులిపిన మ‌హిళ


బీజింగ్ : చైనాలో ప్ర‌భుత్వ కార్యాల‌యంలో ప‌నిచేసే మ‌హిళ త‌న‌ను వేధిస్తున్న బాస్ కు చీపురుతో బుద్ధి చెప్పిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అస‌భ్య‌క‌ర టెక్ట్స్ ను పంపుతున్న బాస్ కు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన ఆమెను రియ‌ల్ హీరోగా నెటిజ‌న్లు కొనియాడారు. బాస్ పై నీళ్లు చ‌ల్లి, బుక్స్ విసిరేస్తూ చీపురుతో మ‌హిళ‌ దుమ్ము దులుపుతున్న 14 నిమిషాల వ్య‌వ‌ధితో కూడిన వీడియో చైనా సోష‌ల్ మీడియా వీబోలో ప‌లువురిని ఆక‌ట్టుకుంది.

చైనాలోని బీలిన్ జిల్లా సిహువా ప్ర‌భుత్వ కార్యాల‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని చైనా అధికారిక మీడియా వెల్ల‌డించింది. వీడియోలో బాధిత మ‌హిళను ఝా, నిందితుడిని వాంగ్ గా గుర్తించారు. వేధింపుల విష‌యాన్ని పై అధికారుల‌కు వివ‌రించ‌గా త‌న బాస్ జోక్ గా టెక్ట్స్ మెసేజ్ లు పంపాన‌ని న‌మ్మ‌బ‌లికాడ‌ని మ‌హిళ చెప్పుకొచ్చారు.

Advertisement
బాస్ వేధింపులు : చీపురుతో దుమ్ముదులిపిన మ‌హిళ
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement