పునరుత్పత్తి.. అనేది ఏ జాతిలో అయినా సరే.. ఆడ, మగ.. రెండు సంయోగం చెందితేనే అవుతుంది. అయితే.. పెరుగుతున్న టెక్నాలజీతో సరోగసీ.. అనే విధానాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినప్పటికీ.. అవి ప్రస్తుతానికి మనుషులే వాటిని ఉపయోగిస్తున్నారు. జంతువులు, పక్షులు, ఇతర జాతుల జీవులన్నీ.. సాధారణంగా సంయోగ ప్రక్రియ ద్వారానే పునరుత్పత్తి చేసుకుంటాయి.
అయితే.. ఇటీవల ఇటలీలోని సార్జీనియాలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. మగ తోడు లేకుండానే.. ఓ ఆడ సొరచేప.. బేబీ సొరచేపకు జన్మనిచ్చింది. సార్జీనియాలోని ఓ ఆక్వేరియంలో.. రెండు ఆడ సొరచేపలు.. గత పదేళ్లుగా ఉంటున్నాయి. గత పదేళ్ల నుంచి ఆ రెండు ఆడ సొరచేపలు మాత్రమే అందులో ఉంటున్నాయి. మగ సొరచేప ఊసే లేదు. కానీ.. ఈ రెండింట్లో ఒక ఆడ సొరచేప.. ఇటీవల ఒక బేబీ షార్క్‌కు జన్మనిచ్చింది.
అయితే.. దీనిపై పరిశోధకులు ఏమంటున్నారంటే.. దీన్నే parthenogenesis reproduction అని అంటున్నారు. అంటే స్వీయ పునరుత్పత్తి అన్నమాట. ఇదివరకు వేరే జాతికి చెందిన సొరచేపల్లో ఇలా స్వీయ పునరుత్పత్తిని గుర్తించారట. కానీ.. ఈ రకం సొరచేపల్లో మాత్రం ఇదే మొదటిసారి అని పరిశోధకులు చెబుతున్నారు. ఆడ సొరచేపలో విడుదలయ్యే ఎగ్ సెల్.. పూర్తిగా అండంగా మారే సమయంలో.. మగసొరచేపల్లో రిలీజ్ అయ్యే స్పెర్మ్లా మారి.. మరో ఎగ్‌తో ఫలదీకరణం చెందడం వల్ల.. స్వీయ పునరుత్పత్తి సాధ్యం అవుతుందని తెలిపారు.
ఇవి.. స్మూత్ హౌండ్ అనే జాతికి చెందిన సొరచేపలు. అయితే.. కొన్ని రకాల కీటకాలు, పురుగుల విషయంలోనూ స్వీయ పునరుత్పత్తి నిరూపితం అయిందని రీసెర్చర్స్ చెప్పుకొచ్చారు.