e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 19, 2021
Home News 12 ఏండ్లుగా రోజుకు అర‌గంటే నిద్రిస్తాడు..అయినా..!

12 ఏండ్లుగా రోజుకు అర‌గంటే నిద్రిస్తాడు..అయినా..!

viral news

టోక్యో : ఒక్కరోజు నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌క‌పోయినా డీలా ప‌డుతుంటాం..అలాంటిది తాను ఏకంగా 12 ఏండ్ల నుంచి రోజుకు కేవ‌లం అర‌గంట మాత్ర‌మే కునుకు తీస్తాన‌ని జ‌పాన్‌కు చెందిన డిసుకె హోరి (36) చెప్పుకొచ్చాడు. రోజూ అతిత‌క్కువ స‌మ‌యం నిద్రిస్తున్నా తాను అలిసిపోవ‌డం అరుద‌ని చెపుతున్నాడు. జపాన్ షార్ట్ స్లీప‌ర్ అసోసియేష‌న్‌కు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించే హోరి త‌న‌లా త‌క్కువ గంట‌లు నిద్ర‌పోతూ ఎక్కువ ఉత్పాద‌క స‌మ‌యం ఎలా పొందాల‌నే దానిపై వంద‌ల మందికి తర్ఫీదు ఇస్తున్నాడు.

రోజులో తాను కోరుకున్నవ‌న్నీ సాధించేందుకు 16 గంట‌ల స‌మ‌యం స‌రిపోద‌ని చెప్పే హోరి క్ర‌మంగా త‌న నిద్ర స‌మ‌యాన్ని 8 గంటల నుంచి 30 నిమిషాల‌కు కుదించాడు. నిద్రించే స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్నా తాను ఇప్ప‌టికీ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నాన‌ని ఆయ‌న అంటాడు. తాను కేవ‌లం అరగంట నిద్ర‌తోనే ఎలా నెట్టుకొస్తాన‌న్న‌ది ప‌రిశీలించేందుకు ప్ర‌ముఖ జ‌ప‌నీస్ టీవీ షో మూడు రోజుల పాటు హోరిని అనుస‌రించింది. ఈ క్ర‌మంలో తొలి రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు లేచిన హోరి జిమ్‌కు వెళ్లాడు..ఆపై కొంత స‌మ‌యం పుస్త‌కాలు చ‌దువుతూ, రాస్తూ గ‌డిపాడు. మ‌ద్నాహ్నం రెండు గంట‌ల స‌మ‌యంలో 26 నిమిషాల పాటు కునుకుతీసి అలారం లేకుండానే నిద్ర లేచాడు.

- Advertisement -

ఆపై స్నేహితుల‌తో ముచ్చ‌టించి మ‌ళ్లీ జిమ్‌కు వెళ్లాడు. ఇక రాత్రి స‌మ‌య‌మంతా వీడియో గేమ్‌లు ఆడుతూ, ఇంట‌ర్‌నెట్ వీక్షిస్తూ, త‌న‌లాంటి షార్ట్ స్లీప్ మిత్రుల‌తో ముచ్చ‌టిస్తూ గ‌డిపాడు. తిన్న త‌ర్వాత ఇన్సులిన్ పెరిగే క్ర‌మంలో నిద్ర‌మ‌త్తును ఎలా అధిగ‌మిస్తాడ‌ని అడ‌గ్గా, త‌న‌కు ఆ స‌మ‌యంలో మ‌గ‌త‌గా ఉన్నా కెఫైన్ తీసుకోవ‌డం ద్వారా నిద్రమ‌త్తు వ‌దులుతుంద‌ని చెప్పుకొచ్చాడు. తాను కొన్నేండ్లుగా నిద్రా స‌మ‌యాన్ని క్ర‌మంగా త‌గ్గిస్తూ వ‌చ్చాన‌ని, అయినా ఇప్ప‌టికీ ప్ర‌జ‌లు గ‌త 12 ఏండ్లుగా తాను రోజుకు అరగంటే నిద్రపోతాన‌ని చెబితే న‌మ్మ‌డం లేద‌ని హోరి చెప్పాడు. ఇక వైద్యులు మాత్రం మెరుగైన ఆరోగ్యం కోసం ప్ర‌తిఒక్క‌రూ రోజుకు ఆరు నుంచి తొమ్మ‌ది గంట‌ల పాటు నిద్రించాల‌ని సూచిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement