దేశీ పెండ్లిండ్లు అంటేనే బావ, బావమరుదుల మధ్య సరదాలు, మరుదులు, మరదళ్ల హంగామా అంతా ఇంతా కాదు. అయితే పెండ్లి వేడుకలో అందరి ముందు ఇలాంటి సరదాలు కొన్ని సార్లు వికటించిన ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇదే తరహాలో కొత్త జంట పెండ్లి వేదికపై కూర్చుండగా పెండ్లి కొడుకును ఆయన బావమరిది ఆటపట్టించాడు.
పెండ్లి కొడుకు వారిస్తున్నా అతడి బుగ్గలు పట్టి లాగుతూ విసుగుపుట్టించాడు. అతడి చేతులు పట్టకుని ఆపినా అదే పనిచేస్తుండంగా విసిగిన పెండ్లి కొడుకు బావమరిదిని కొట్టడంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. నిరంజన్ మహాపాత్ర అనే ఇన్ స్టా గ్రాం యూజర్ ఈ వీడియోను షేర్ చేయడంతో నెటిజన్ల నవ్వుల మధ్య ఈ వీడియో తెగ వైరలవుతోంది.