పెండ్లి వేడుక కోసం వధూవరులు దర్జాగా ఏ ఫ్యాన్సీ కారు కాకుంటే గుర్రపు బండిపై ఊరేగుతూ పెండ్లి మండపంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తారు. కానీ ఈ జంట తమ పెండ్లి మంటపానికి చేరుకునేందుకు సైకిల్ రిక్షాను ఆశ్రయించారు. పెండ్లి జంట రిక్షాలో వేదిక వద్దకు రాగానే బంధువులు, స్నేహితులు వారికి చప్పట్లు, కేరింతలతో ఘనంగా స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రాం పేజ్ ది వెడ్డింగ్ స్టోరీస్‌లో షేర్ చేశారు.
ఈ వీడియో క్లిప్ ఇప్పటికి 14వేలకు పైగా వ్యూస్‌ను రాబట్టి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో షేర్వాణి ధరించిన పెండ్లికొడుకు సైకిల్ రిక్షా తొక్కుతూ పెండ్లి వేదిక వద్దకు రాగా వధువు వెనుక రిక్షాలో కూర్చునిఉంది. ఆపై రిక్షా దిగిన వరుడు ఆమెను చేయి పట్టుకుని కిందికి దింపాడు. కొత్త జంటను దిష్కా చౌధురి, రూపేష్ మానంగా గుర్తించారు.