వాషింగ్టన్: అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా డాలర్లు సంపాదించాలని సగటు భారతీయ యువకుడి సాకారం దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటివరకు ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లి.. అక్కడే హెచ్-1 బీ వీసా కింద ఉద్యోగాలు చేస్తున్న వలస కార్మికులు, వారి పిల్లలకు గ్రీన్ కార్డ్ జారీ చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన రెండు కీలక బిల్లులకు అమెరికా ప్రజా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.
దీంతో అమెరికాలో నివసిస్తున్న లక్షల మంది వలస కార్మికులకు గ్రీన్ కార్డ్ జారీ చేయడానికి మార్గం సుగమం అయ్యింది. అమెరికన్ డ్రీమన్ అండ్ ప్రామిస్ యాక్ట్-2021కి గురువారం ప్రజాప్రతినిధుల సభ 228-197 తేడాతో ఆమోదం తెలిపింది. తద్వారా అమెరికా ఇమ్మిగ్రేషన్ సిస్టమ్‌కు జో బిడెన్ ప్రతిపాదించిన సమూల సవరణలకు కీలక ముందడుగు పడింది.
గతేడాది నవంబర్‌లో బైడెన్ తన ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఐదు లక్షల మందికి పైగా భారతీయులతోపాటు 1.1 కోట్ల మంది విదేశీ వలస కార్మికులు కలగన్న గ్రీన్ కార్డ్ కల త్వరలో సాకారం కానున్నది. ఇక హెచ్-1 బీ వీసా కింద అమెరికాలో పని చేస్తున్న విదేశీ సంతతి నిపుణుల పిల్లలకు 21 ఏండ్లు వచ్చిన తర్వాత రిలీఫ్ కానున్నది. హెచ్-1 బీ వీసా కింద అమెరికాలో పని చేస్తున్న విదేశీయుల్లో భారతీయ యువతే అత్యధికంగా ఉన్నారు. ఈ బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం లభిస్తే.. అటుపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకంతో చట్టంగా మారనున్నది.