e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home News హెచ్‌-1 బీ వీసాలు రెట్టింపు చేయాలి.. అమెరికా చాంబ‌ర్స్ ఆఫ్ కామ‌ర్స్

హెచ్‌-1 బీ వీసాలు రెట్టింపు చేయాలి.. అమెరికా చాంబ‌ర్స్ ఆఫ్ కామ‌ర్స్

హెచ్‌-1 బీ వీసాలు రెట్టింపు చేయాలి.. అమెరికా చాంబ‌ర్స్ ఆఫ్ కామ‌ర్స్

వాషింగ్ట‌న్‌: అమెరికాలో స్కిల్డ్, నిపుణుల ఉద్యోగులు, కార్మికుల కొర‌త తీవ్రంగా ఉన్న‌ద‌ని అమెరికా చాంబ‌ర్స్ ఆఫ్ కామ‌ర్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈ కొర‌త‌ను అధిగ‌మించేందుకు విదేశీ వ‌ర్క‌ర్ల‌కు ఇచ్చే హెచ్‌-1 బీ వీసాల‌ను రెట్టింపు చేయాల‌ని పేర్కొంది. వివిధ దేశాల నుంచి వ‌ల‌స వ‌చ్చి అమెరికాలో స్థిర ప‌డిన నిపుణుల‌కు గ్రీన్ కార్డు జారీపై దేశాల వారీ కోటాకు చ‌ర‌మ గీతం పాడాలని సూచించింది.

అమెరికాలోని టెక్నాల‌జీ కంపెనీలు త‌మ అవ‌స‌రాల కోసం ప్ర‌తియేటా భార‌త్‌, చైనా నుంచి వేల మంది ఉద్యోగుల‌ను హెచ్‌-1 బీ వీసాల‌పై నియ‌మించుకుంటాయి. ప్ర‌తియేటా 65 వేల మంది విదేశీ విద్యార్థుల‌కు, మ‌రో 20 వేల మంది అమెరికాలో ఉన్న‌త విద్య‌న‌భ్య‌సించిన విదేశీయుల‌కు హెచ్‌-1బీ వీసాను అమెరికా జారీ చేస్తుంది.

- Advertisement -

ఉద్యోగులు, కార్మికుల కొర‌త గ‌ల రంగాల్లో ఉద్యోగుల నియామ‌కానికి లీగ‌ల్ ఇమ్మిగ్రేష‌న్ వ్య‌వ‌స్థ‌లో పూర్తిగా సంస్క‌ర‌ణ‌లు తేవాల‌ని అమెరికా చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ అండ్ సీఈవో సుజాన్నె క్లార్క్ చెప్పారు.

రెట్టింపు సంఖ్య‌లో హెచ్‌1-బీ, హెచ్‌2-బీ వీసాల‌ను ఇవ్వాల‌ని సుజాన్నె క్లార్క్ కోరారు. ఉద్యోగాల క‌ల్ప‌న‌కు వీలైన సంస్థ‌ల్లో పెట్టుబ‌డులను పెంచాల‌ని కోరింది అమెరికా చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌. వ‌ర్కింగ్ పేరెంట్స్ పిల్ల‌ల కేర్ ప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అభ్య‌ర్థించింది.

ప్ర‌తి ఏటా ఉద్యోగాల ఆధారిత ఇమ్మిగ్రెంట్ వీసాల‌ను 1.40 ల‌క్ష‌ల నుంచి 2.8 ల‌క్ష‌ల‌కు పెంచాల‌ని అమెరికా చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ కోరింది. అందుకు అనుగుణంగా ఎంప్లాయిమెంట్ ఆధారిత ఇమ్మిగ్రేంట్ వీసాల జారీ విధానంలో మార్పులు తేవాల‌ని సూచించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హెచ్‌-1 బీ వీసాలు రెట్టింపు చేయాలి.. అమెరికా చాంబ‌ర్స్ ఆఫ్ కామ‌ర్స్
హెచ్‌-1 బీ వీసాలు రెట్టింపు చేయాలి.. అమెరికా చాంబ‌ర్స్ ఆఫ్ కామ‌ర్స్
హెచ్‌-1 బీ వీసాలు రెట్టింపు చేయాలి.. అమెరికా చాంబ‌ర్స్ ఆఫ్ కామ‌ర్స్

ట్రెండింగ్‌

Advertisement