e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News జగమంతా శివపదం.. అద్భుతంగా సాగిన పాటల పోటీ

జగమంతా శివపదం.. అద్భుతంగా సాగిన పాటల పోటీ

జగమంతా శివపదం.. అద్భుతంగా సాగిన పాటల పోటీ

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ దాదాపు 1000 పైగా శివపద గీతాలు అత్యద్భుతంగా రచించారు. ఋషీపీఠం ఆధ్వర్యంలో శివపదాలను మొట్టమొదటిసారిగా పాటల పోటీగా ఈ నెల మే 14, 15, 16న ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ మాధ్యమంగా నిర్వహించారు. కార్యక్రమానికి విశేషస్పందన లభించిందని 4 ఖండాల్లోని 9 దేశాలనుంచి 213 మంది ఔత్సాహికులు పాల్గున్నారని నిర్వాహకులు వాణీ గుండ్లపల్లి, రవి గుండ్లపల్లి , మేఘన , నాగ సంపత వారణాసి బృందం తెలిపింది.

ఐదు గ్రూపులుగా ఔత్సాహికులు..

ఔత్సాహికులను 5 విభాగాలుగా విభజించి, ఆయా విభాగాలకు ప్రశస్త శివభక్తుయిన ‘ఉపమన్యు’, ‘మార్కండేయ’, ‘భక్త కన్నప్ప’, ‘నత్కీర’, ‘పుష్పదంత’ గా పేర్లు నిర్ణయించారు. అమెరికా, భారత్ ,ఆస్ట్రేలియా, సింగపూర్ నుంచి 11 మంది ప్రఖ్యాత సంగీత గురువులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వీరిలో భారతదేశం నుంచి శ్రీమతి తులసి విశ్వనాథ్, శ్రీమతి పద్మ త్యాగరాజన్, శ్రీమతి శారదా సుబ్రమణియన్, శ్రీకౌశిక్ కల్యాణ్, శ్రీసాయి కృష్ణ, శ్రీమతి పెద్దాడ సూర్యకుమారి, అమెరికా నుంచి శ్రీమతి పావని మల్లాజ్యోస్యుల , శ్రీమతి సవిత నముడూరి, శ్రీమతి లక్ష్మి కొలవెన్ను, సింగపూర్ నుంచి శ్రీమతి పద్మావతి, ఆస్ట్రేలియా నుంచి శ్రీమతి పద్మా మల్లెల ఉన్నారు.

పంచముఖశివుని ప్రతీకగా ఐదు విభాగాలతో ఐదు పూటలా ఈ కార్యక్రమం జరిగింది. ప్రతిపూటా పరిచయవ్యాఖ్యలతో కార్యక్రమం మొదలయ్యింది. అందరి పాటలనూ విన్న శ్రీషణ్ముఖ శర్మ తాను జీవితపరమావధిగా రాసుకున్న పాటలను ఔత్సాహిక గాయకులు చక్కగా పాడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.

ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు..

చాలామంది చిన్నపిల్లలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రవాసులైనా సంప్రదాయ వస్త్రధారణతో, స్పష్టమైన ఉచ్ఛారణతో శృతి , లయబద్ధంగా అద్భుతంగా పాటలు ఆలపించారు. చిన్మయ జ్యోతిర్మయలింగం, పాలవన్నెవాడు, పటికంపు ఛాయ, గిరులే శ్రుతులు, శివుడు ధరించిన, సకలమంత్రముల సంభవమూలం, సభాపతి పాహిపాహిమామ్ మొదలుకుని దాదాపు 150 పైగా శివపదాలను అద్భుతంగా, వీనులవిందుగా పాడారు. న్యాయనిర్ణేతలు తగు సూచనలు ఇస్తూ ఉత్సాహంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

శివభక్తిలో ముగిపోయేలా..

‘ఆత్మాత్వం గిరిజా మతిః ’ అని శివ మానసపూజలో శ్రీశంకర భగవత్పాదులు అన్నట్లుగా, పాడేవారూ, వేలాదిగా విన్నవారూ, అందరూ తన్మయత్వంతో శివభక్తిలో ముగిపోయేలా ఆద్యంతం రసరయంగా జరిగింది ఈ కార్యక్రమం. భారతదేశంలో శుక్రవారం ప్రదోష వేళలో మొదలై.. అమెరికాలో ఆదివారం శంకర జయంతి రోజున ముగిసింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని, ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన శ్రీమతి వాణి , శ్రీరవి గుండ్లపల్లిని వీక్షకులంతా అభినందించారు.

జగమంతా శివపదం.. అద్భుతంగా సాగిన పాటల పోటీ

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జగమంతా శివపదం.. అద్భుతంగా సాగిన పాటల పోటీ

ట్రెండింగ్‌

Advertisement