e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home News ఘనంగా ప్రముఖ నటి జమున పుట్టిన రోజు వేడుకలు

ఘనంగా ప్రముఖ నటి జమున పుట్టిన రోజు వేడుకలు

హైదరాబాద్‌ : ప్రముఖ నటి డాక్టర్ జమునా రమణారావు (85) వ జన్మదినోత్సవం అంతర్జాలంలో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగింది. 30 కళాసమితుల సహకారంతో వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా, తెలుగు కళా సమితి ఖతార్ కలిసి 16 గంటల పాటు అత్యంత అద్భుతంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు పాల్గొని జమునకు దీవెనలు అందజేశారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాదేవి ఆశీర్వదిస్తూ నేను జమున అభిమానిని తెలిపారు. ఆరోజుల్లో జమున సినిమా వస్తుందంటే చాలు ఎదురు చూసి మరీ రాగానే వెళ్లి పోయేదానిని గుర్తు చేసుకున్నారు.

నూరు సంవత్సరాల వయసులో జమునకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే అవకాశం రావడం నిజంగా నాకు చాల సంతోషంగా ఉందన్నారు. అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించారు. సీతామహాలక్ష్మి ఆశీర్వదించడం పట్ల జమున ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడు కె విశ్వనాధ్ మాట్లాడుతూ..జమునకు 85 వ పుట్టినరోజంటే నమ్మలేకుండా ఉన్నాం. ఇప్పుడే నిన్నకాక మొన్న పెద్దమనిషివై నటనలో సత్యభామ లాగా ఇంకా మా కండ్ల ముందర కనిపిస్తున్నావని నాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండి, ఇంకా ఒక యాభై ఏళ్లు హాయిగా ఉండాలని ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి (USA) జమునకు డాక్టర్ సి.నారాయణరెడ్డి  స్వర్ణ కంకణ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించారు. అనంతరం వంశీ రామరాజు మాట్లాడుతూ.. జమునకు డిసెంబర్ నెలలో హైదరాబాద్ లో కనకాభిషేకం చెయ్యబోతున్నట్టు ఆ సందర్భంగా అమెరికా గాన కోకిల శారద ఆకునూరి మెగా సంగీత విభావరి సమర్పించనున్నారని తెలిపారు.  

ఈ కార్యక్రమంలో 30 దేశాల నుంచి 200 మందికి పైగా కవులు, కళాకారులు పాల్గొని జమున నటించిన చిత్రాలలోని పాటలు ఎంచుకుని ఆట పాటలతో కార్యక్రమం ఆసాంతం రక్తి కట్టించారు.
ఈ కార్యక్రమాన్ని తాతాజీ ఉసిరికల నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ కె. వి. రమణ, మురళీమోహన్, మండలి బుద్ధప్రసాద్, కె. ఐ. వరప్రసాద్ రెడ్డి, డాక్టర్ ఏవీ గురవా రెడ్డి, ఉపేంద్ర చివుకుల ( అమెరికా ), డాక్టర్ ఎంఎస్‌ రెడ్డి (అమెరికా), శారద ఆకునూరి ( అమెరికా ), డాక్టర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి (అమెరికా), తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు, డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, మాధవపెద్ది సురేష్, భువనచంద్ర, డాక్టర్. కె.వి.కృష్ణ కుమారీ, దివ్యవాణి, తులసి, రోజా రమణి, డాక్టర్ చిట్టెం రాజు వంగూరి, లక్ష్మీ రాయవరపు ( కెనడా ), గుణసుందరి కొమ్మారెడ్డి ( అమెరికా), లలితారాం (అమెరికా), కల్యాణి కొండూరు (ఖతార్ ) శైలజ సుంకరపల్లి, డాక్టర్ తెన్నేటి సుధాదేవి, శ్రీదేవి జాగర్లమూడి ( అమెరికా), శారద కాశివజ్జల ( అమెరికా), లయన్ లక్ష్మీప్రసాద్ కపటపు,
సుధీర్ కోట (అమెరికా), రాజేష్ ఎక్కలి ( అమెరికా) కె ఎస్‌ ప్రసాద్ (ఖతార్), తాతాజీ ఉసిరికల (ఖతార్) రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), రాధిక మంగిపూడి ( సింగపూర్), సురేష్ కొండేటి,
జయ పీసపాటి ( హాంగ్ కాంగ్),

బీ.కృష్ణ కుమార్ ( ఖతార్), విఆర్ఆర్ పద్మజ ( ఖతార్), రాజేష్ తోలేటి (యూ కె), జివిఎన్ నరసింహం , శ్రీలత మగతల (న్యూజిలాండ్), సారధి మోటమర్రి ( ఆస్ట్రేలియా), విజయ గొల్లపూడి ( ఆస్ట్రేలియా), డాక్టర్ వ్యాసకృష్ణ బూరుగుపల్లి (యుగాండా), రాపోలు సీతారామరాజు ( సౌత్ ఆఫ్రికా), విక్రమ్ (సౌత్ ఆఫ్రికా), డాక్టర్ వెంకటపతి ( నార్వే), అనిల్ కుమార్ కడించెర్ల (ఒమాన్), హరి వేణుగోపాల్ (ఒమాన్), ఎంవివి సత్యనారాయణ (ఖతార్),డి .సాయి సుబ్బారావు (కువైట్), వెంకటేశ్వరరావు (బోత్సువానా), సతీష్ (బోత్సువానా), పార్థసారథి (యుగాండా), సుందరగిరి శంకర గౌడ్ ( ఖతార్), రాధిక నోరి (అమెరికా), సత్యాదేవి మలుల్ల (మలేషియా), మరియు ఖతార్ తెలుగు కళాసమితి కార్యవర్గం పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని అమెరికా గాన కోకిల శారద ఆకునూరి ( అమెరికా), కల్యాణి కొండూరు (ఖతార్), సుజిత సైని (ఖతార్), దుర్గా భవాని (ఖతార్), గౌరీదేవి బొమ్మన (ఖతార్) మాధవి బైటారు (ఖతార్), వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని trinet లైవ్ టీవీ వారు ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేశారు.

ఇవి కూడా చదవండి..

Good news | మెట్రో రైలు సేవలు మరో అరగంట పొడిగింపు

విషాదం : నీటి కుంటలో పడి బాలుడు మృతి

Yadadri temple : యాదాద్రిలో భక్తుల కోలాహలం

విద్యతోనే మానవ వనరుల అభివృద్ధి: మంత్రి హరీశ్‌ రావు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana