శనివారం 29 ఫిబ్రవరి 2020
ఫ్లాటు కొంటున్నారా.. జర ఆగండి.. ఈ జాగ్రత్తలు పాటించండి

ఫ్లాటు కొంటున్నారా.. జర ఆగండి.. ఈ జాగ్రత్తలు పాటించండి

Feb 08, 2020 , 11:45:06
PRINT
 ఫ్లాటు కొంటున్నారా.. జర ఆగండి.. ఈ జాగ్రత్తలు పాటించండి

తెలివైన పెట్టుబడిదారులు మార్కెట్‌ నీరసంగా ఉన్నప్పుడే రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెడతారు. ఇలా, భిన్నంగా ఆలోచించి..

తెలివైన పెట్టుబడిదారులు మార్కెట్‌ నీరసంగా ఉన్నప్పుడే రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెడతారు. ఇలా, భిన్నంగా ఆలోచించి.. భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతాలను గుర్తించి.. ధైర్యంగా అడుగు ముందుకేస్తేనే.. అతితక్కువ కాలంలో మంచి లాభాలను అందిపుచ్చుకోవచ్చు. చాలామంది ఏం చేస్తుంటారంటే.. మార్కెట్లో ధరలు పెరిగేటప్పుడు లేదా పూర్తిగా పెరిగిన తర్వాత స్థలాలను కొంటుంటారు. వాస్తవానికి, ఇలా చేయడం తెలివైన మదుపరి లక్షణం కానే కాదు. పెద్దనోట్ల రద్దు వల్ల మార్కెట్‌ నీరసించడం.. అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతాల్లో ప్లాట్లను కొనుగోలు చేయడం సరైన నిర్ణయమని చెప్పొచ్చు. అయితే, ఇందుకోసం ఓ పక్కా వ్యూహాన్ని అనుసరిస్తేనే.. మనం ఆశించిన లాభాలను అందిపుచ్చుకోవచ్చు.


-ఒకవేళ పెద్ద ఫ్లాట్లను కొనడానికి తగినంత సొమ్ము లేకపోతే, సింగిల్‌ బెడ్‌రూం ఫ్లాట్లయినా కొనుగోలు చేయడానికి వెనకడుగు వేయకండి. అతితక్కువ పెట్టుబడితో మంచి వాణిజ్య సముదాయంలో స్థలం కొనుగోలు చేసినా క్రమం తప్పకుండా ఆదాయం గిట్టుబాటవుతుంది. చిన్న చిన్న స్థలాలైతే, వాటిని అద్దెకు తీసుకోవడానికి చాలామంది ముందుకొస్తారు. కాబట్టి, పెట్టుబడికి పూర్తి భరోసా ఉంటుంది. ఒకవేళ, కాస్త సొమ్ము చేతిలో ఉంటే.. రూ.40 లక్షల్లోపు విలువ గల ఫ్లాటును కొనుగోలు చేసినా మంచి ఆదాయం గిట్టుబాటవుతుంది. అయితే, ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లోనే కొనుగోలు చేయాలి. పైగా, ఆయా ప్రాంతానికి రహదారులు, విద్యుత్తు, మంచినీరు వంటివి అభివృద్ధి చెంది ఉన్నాయా? లేవా?అనే అంశాన్ని గమనించాకే తుది నిర్ణయానికి రావాలి.


-ఫ్లాట్లలో పెట్టుబడి పెట్టేవారు.. మంచి ధర కోసం డెవలపర్‌తో బేరమాడండి. ఒకవేళ డెవలపర్‌కు సొమ్ము అత్యవసరంగా కావాల్సి వస్తే.. మీరు కోరుకున్న ధరకే ఫ్లాటును విక్రయించే అవకాశమున్నదని గుర్తుంచుకోండి. మార్కెట్‌ ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవడం మీద దృష్టి సారించాలి. ఫ్లాట్లలో పెట్టుబడి పెట్టేవారు.. కనీసం రెండేళ్ల వరకూ వేచి చూసే ఓపికను అలవర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో మన పెట్టుబడికి ఊహించిన ఆదాయం రాకపోవచ్చు. అయినా, దిగులు చెందకుండా ఓపికగా వ్యవహరించాలి. ఫ్లాటు కొనుగోలు చేసిన నాలుగైదేళ్ల తర్వాత అమ్ముకుంటే.. మనం ఊహించినట్టుగా ఆదాయం గిట్టుబాటవుతుంది.


logo