e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News మ‌నోళ్ల‌ ‘డాలర్’ డ్రీమ్స్ నెరవేరినట్లే.. ట్రంప్ బిల్లుకు రాంరాం!!

మ‌నోళ్ల‌ ‘డాలర్’ డ్రీమ్స్ నెరవేరినట్లే.. ట్రంప్ బిల్లుకు రాంరాం!!

మ‌నోళ్ల‌ ‘డాలర్’ డ్రీమ్స్ నెరవేరినట్లే.. ట్రంప్ బిల్లుకు రాంరాం!!

న్యూఢిల్లీ: భారత ఐటీ నిపుణులు, ఐటీ సంస్థ‌ల‌కు అమెరికా భారీ రిలీఫ్ ఇచ్చింది. అమెరికాలో హెచ్‌-1 బీ వీసా కింద వ‌ర్క‌ర్ల ప్ర‌వేశానికి గ‌ల ప‌రిమితి నిబంధ‌న‌ను ఎత్తివేయాల‌ని అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణ‌యించారు. దీంతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హ‌యాంలో ప్ర‌తిపాదించిన ప‌క్ష‌పాత పూరిత నిర్వ‌చ‌నానికి తెర ప‌డ‌నున్న‌ది.

అమెరికాలోని ఐటీ సంస్థ‌ల్లో ప‌ని చేసేందుకు విదేశీ వ‌ర్క‌ర్ల‌కు హెచ్‌-1బీ వీసా జారీ చేయాలంటే ‘ప్రత్యేక వృత్తి నిపుణులు’ అయి ఉండాలని ట్రంప్ సర్కార్ బిల్లును ప్రతిపాదించింది. అయితే, అది అమలుకు నోచుకోలేదు. మిగతా ట్రంప్ వివాదాస్పద నిర్ణయాల మాదిరిగానే హెచ్-1 బీ వీసాల జారీకి ఆయన ప్రతిపాదించిన బిల్లును గతేడాది డిసెంబర్ నెలలో ఓ న్యాయస్థానం కొట్టేసింది.

తాజాగా అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ నిర్ణ‌యం మేర‌కు.. హెచ్-1 బీ వీసా వర్కర్లు, ఉద్యోగుల ఆఫ్ సైట్ నియామకాలపై ఆంక్షలు విధించేందుకు ట్రంప్ ప్రతిపాదిత బిల్లును డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) లాంచనంగా ఎత్తివేసింది. విదేశీ నిపుణుల కోసం ఐటీ సంస్థల నుంచి డిమాండ్లు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.

ట్రంప్ ప్ర‌తిపాదిత నిబంధ‌న‌ను ఎత్తివేస్తూ బుధ‌వారం ఫెడ‌ర‌ల్ రిజిస్ట‌ర్‌లో ప్ర‌చురిస్తారు. విదేశీ నిపుణుల‌కు జారీ చేసే హెచ్‌-1బీ వీసాల‌కు స‌రికొత్త నిర్వ‌చ‌న‌మిస్తూ 2020 అక్టోబ‌ర్‌లో ట్రంప్ జారీ చేసిన ఇంట‌రిం ఫైన‌ల్ రూల్ (ఐఎఫ్ఆర్‌)ను ఫెడ‌ర‌ల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఎత్తివేసింది.

ట్రంప్ ఐఎఫ్ఆర్‌ను తొల‌గిస్తూ డీహెచ్ఎస్ తుది ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ విష‌యాన్ని యూఎస్ సిటిజ‌న్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేష‌న్ స‌ర్వీసెస్ (యూఎస్సీఐఎస్‌) మంగ‌ళ‌వారం తెలిపింది.

‘థర్డ్ పార్టీ వర్క్ సైట్’, ‘యజమాని- ఉద్యోగి సంబంధం’, ‘ప్రత్యేక వృత్తి’ అనే నిర్వచనాలను మార్చాలన్న లక్ష్యంతో ట్రంప్ ఐఎఫ్ఆర్ ప్రతిపాదించారు. దీనివల్ల అమెరికాలోని థర్డ్ పార్టీ లొకేషన్లలోని కంపెనీలు హెచ్-1 బీ వీసాలను పొందే సామర్థ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది.

ట్రంప్ తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయం అమలులోకి వచ్చి ఉంటే భారతీయ ఐటీ సంస్థలు, వర్కర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడేది. అదే విధంగా హెచ్-1బీ వీసాలను పొందేందుకు విద్యార్హతల నిబంధనలనూ సడలించడం ఐఎఫ్ఆర్ లక్ష్యం. దీని వల్ల భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం పడుతుంది.

విదేశాలకు చెందిన సాంకేతిక నిపుణులను అమెరికా కంపెనీలు ఉద్యోగులుగా నియమించుకోవడానికి అనుమతించే నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా హెచ్-1బీ వీసా. అమెరికాలోని ఐటీ సంస్థలు.. భారత్, చైనా నుంచి లక్షల మంది ఐటీ నిపుణులను ప్రతిఏటా ఈ వీసా కింద నియమించుకుంటాయి.

అమెరికా ప్రతియేటా 85 వేల హెచ్-1 బీ వీసాలను జారీ చేస్తుంది. అందులో 70 శాతం భారతీయ నిపుణులవే కావడం గమనార్హం. గత కొన్నేండ్లుగా నిబంధనలు కఠినతరం కావడంతో భారతీయ కంపెనీలకు లభించిన హెచ్-1బీ వీసాల వాటా తగ్గిపోయింది.

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

ఇవి కూడా చ‌ద‌వండి..

ఈ-కామర్స్‌పై ఫిర్యాదు ఇక సులభం

బార్జ్ మున‌క : నాలుగో రోజు కొనసాగుతున్న అన్వేష‌ణ‌

కాలిక‌ట్ చేరిన వాస్కోడిగామా.. చ‌రిత్ర‌లో ఈరోజు

అహ్మదాబాద్‌లో కుప్ప‌కూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో

సముద్ర పర్యవేక్ష‌ణ‌కు ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌యోగించిన‌ చైనా

మార్స్‌పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవ‌ర్‌

ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవ‌చ్చు.. ఆర్‌బీఐ స‌ర్క్యుల‌ర్ జారీ

క‌మ‌ల్ హాస‌న్ కు మ‌రో షాక్: ఎంఎన్ఎంను వీడిన‌ కుమార్ వేల్

విజయకాంత్ ఆరోగ్యంపై భిన్న క‌థ‌నాలు..!

కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?

వ్యాక్సిన్ త‌యారీ : నూత‌న‌ ఫార్మా బిలియ‌నీర్లుగా ఎదిగారు!

జూన్ 1-6 మ‌ధ్య ఐటీ వెబ్‌సైట్ ప‌ని చేయ‌దు.. ఎందుకంటే!

ఇండియాలో క్రిప్టో క‌రెన్సీకి చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌? త్వ‌ర‌లో మ‌రో క‌మిటీ ఏర్పాటు!!

గుజ‌రాతీల‌కు మారుతి అండ‌: సీతాపూర్‌లో మ‌ల్టీ స్పెషాలిటీ ద‌వాఖాన‌

క్రెడిట్ కార్డుల వాడ‌కంతో ఇలా రివార్డు పాయింట్లు..!

అత్యంత ఖ‌రీదైన కాన్వాయ్ ముఖేష్ అంబానీదే..

పీపీఎఫ్‌లో రూ.12 వేల మ‌దుపు.. 15 ఏండ్లకు ఎంత లభిస్తుందంటే..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మ‌నోళ్ల‌ ‘డాలర్’ డ్రీమ్స్ నెరవేరినట్లే.. ట్రంప్ బిల్లుకు రాంరాం!!

ట్రెండింగ్‌

Advertisement